నా వ్యాయామం కూసింత వైవిధ్యం అంటున్న సుధీర్


నా వ్యాయామం కూసింత వైవిధ్యం అంటున్న సుధీర్

ఎస్.ఎo.ఎస్ (SMS శివ మనసులో శృతి) సినిమా ద్వారా మన తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం అయ్యాడు “సుధీర్ బాబు“, నిజానికి ఇతగాడు వరుసకి “మహేష్ బాబు” కి బావ గారు, కాని అలాంటి ఇమేజ్ లేకుండా తన కంటూ ఒక పేరు సంపాదించుకున్నారు, మనకి చాలా సినిమాల ద్వారా తన నట విశ్వరూపాన్ని సమపాళ్ళలో చూపించడం జరిగింది, అంతేనా ఇంకా చెప్పుకుంటూ పోతే, బాడీ బిల్డర్, సూపర్ ఎనర్జిటిక్ డాన్సర్, అబ్బో చాలా వున్నాయి అవి మనం చూసేసాం కూడా.

ఇక విషయానికి వొస్తే ఇతగాడి సినిమాల పరంగా కిందటి సంవత్సరం 2018 లో 2 సినిమాల ద్వారా మన ముందుకి వచ్చాడు, అందులో “నన్ను దోచుకుందువటే” మరియు “వీర భోగ వసంత రాయులు”, ఇందులో నన్ను దోచుకుందువటే మన సుధీర్ బాబు కి మంచి పేరు తన ఖాతాలో ఒక హిట్ పడేలా చేసింది, ఇంకా మిగిలిన వీర భోగ వసంత రాయలు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, ఒక్క సుధీర్ బాబు కే కాకుండా ఇందులో పని చేసిన, యాక్టింగ్ చేసిన వాళ్ళందరికీ ఈ సినిమా ఒక చేదు అనుభవం ఇచ్చింది.

తన 16 వ సినిమాగా వొస్తున్న “వి” సినిమా పై బాగా అంచనాలతో హిట్ కొట్టేలా ఉన్నాడు, ఎందుకంటే ఈ సినిమా కి దర్శకత్వం “ఇంద్రగంటి మోహన క్రిష్ణ” గారు, ఒక డీసెంట్ సినిమాలు తీసే అతి కొంతమందిలో ఇతని పేరు వుంటుంది అంటే అది అతిశయోక్తి కాదు, ఇంకా ఈ సినిమాలో నాచురల్ స్టార్ “నాని” ప్రతినాయక ఛాయాలున్న పాత్ర చేస్తున్నాడు అని ఫిలిం నగర్ లో విన్పిస్తున్న హాట్ టాపిక్.

ఇక అసలు విషయానికి వొస్తే ఇతగాడు ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేసారు అది ఏంటంటే, “ఎందుకు మీరు మీ వ్యాయామం ని రోజు చేసినట్టు చేస్తున్నారు, నా జిమ్ ట్రైనర్ “జాఫర్ అలి”ని చూడండి నాకు నా కార్ ని ముందుకి నెడుతూ వ్యాయామం చేయండి అని అన్నారు నేను వెంటనే వ్యాయామం ని బోరింగ్ గా ఉండకుండా డైలీ చేసినట్లు చేయకుండా ఇలా చేయడం వల్ల మన బాడీ లోకి కూడా కొంత శ్వాస, ఎనర్జీ ఆడ్ అవుతుంది అని ట్వీట్ చేసారు”, నిజంగానే చాలా విభిన్నంగా ఆలోచించిన ట్రైనర్ ని అభినందించాలి, అలాగే అమలు పరిచిన మన హీరో కి కూడా అభినందనలు చెప్పకుండా ఉండలేం.

ముందుగా మీ “వి” సినిమా కు మా “Tollywood. Net” తరపున బెస్ట్ విషెస్.