మహేష్ బావకు వాళ్లతో గొడవయ్యిందట


sudheer babu tweets on veerabhoga vasantharayalu film

మహేష్ బాబు బావ హీరో సుధీర్ బాబు కు వీర భోగ వసంతరాయలు చిత్ర బృందానికి గొడవలు అయ్యాయట ! దాంతో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుధీర్ బాబు పాల్గొనలేదు అలాగే తన పాత్రకు కూడా డబ్బింగ్ చెప్పలేదు . సుధీర్ బాబు తన పాత్రకు డబ్బింగ్ చెప్పకపోవడంతో వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించారు . అక్టోబర్ 26 న వీర భోగ వసంతరాయలు చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇంద్రసేన దర్సకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుధీర్ బాబుతో పాటుగా నారా రోహిత్ , శ్రీ విష్ణు , శ్రియా శరన్ లు నటించారు . టీజర్ తో అంచనాలు పెంచిన ఈ చిత్రం పై పాజిటివ్ టాక్ అయితే ఉంది కానీ సుధీర్ బాబు కి మేకర్స్ కి ఎక్కడో తేడా కొట్టింది అందుకే డబ్బింగ్ చెప్పలేదు , నిన్నటి ఈవెంట్ కి రాలేదు .

అయితే సుధీర్ బాబు పాత్ర కి ఎవరో డబ్బింగ్ చెప్పారన్న విషయం త్వరగా స్ప్రెడ్ కావడంతో స్పందించాడు సుధీర్ బాబు . నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పలేదు , నాకు ఆ చిత్ర బృందానికి మద్య ఏమి జరిగింది అన్నది బయటకు చెప్పడం భావ్యం కాదని ట్వీట్ చేసాడు . దాంతో క్లియర్ అయ్యింది ఇద్దరి మద్య ఏదో ఒక గొడవ జరిగిందని . ఇటీవలే నన్ను దోచుకుందువటే చిత్రంతో హీరోగా , నిర్మాతగా విజయం సాధించాడు సుధీర్ బాబు .

English Title: sudheer babu tweets on veerabhoga vasantharayalu film