సుధీర్‌బాబు `శ్రీ‌దేవి సోడా సెంట‌ర్‌`

 Sudheer Babu's new movie Sridevi Soda center Motion poster released

Sudheer Babu’s new movie Sridevi Soda center Motion poster released

భ‌లే మంచి రోజు, ఆనందో బ్ర‌హ్మ‌, యాత్ర వంటి  హిట్ చిత్రాల్ని అందించిన 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత‌లు విజ‌య్ చిల్లా, శ‌శిదేవిరెడ్డి మ‌రో వినూత్నచిత్రాన్ని అందిస్తున్నారు. సుధీర్‌బాబు హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి `శ్రీ‌దేవి సోడా సెంట‌ర్‌` అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు. `ప‌లాస 1978` ఫేమ్ క‌రుణ కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ బ్యాన‌ర్‌లో ప్రొడ‌క్ష‌న్ నె.4గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ని మేక‌ర్స్ శుక్ర‌వారం విడుద‌ల చేశారు. విద్యుద్దీపాల వెలుగులో వెలిగిపోతున్న అమ్మోరు…కాంతుళీనుతున్న రంగుల రాట్నం ( జాయింట్ వీల్‌)… తొలు బొమ్మ‌లాట‌… ఎల్లో ష‌ర్ట్ ధ‌రించి భుజానికి క‌ల‌ర్ క‌ల‌ర్ సీరియ‌ల్ బ‌ల్బ్‌లు వేసుకుని చేతిలో గోలీ సోడాతో హీరో సుధీర్‌బాబు క‌నిపిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది.

మ‌ణిశ‌ర్మ మ‌ళ్లీ త‌ర‌దైన మార్కు సంగీతంతో మోష పోస్ట‌ర్‌ని మ‌రింత‌గా ఎలివేట్ చేసిన తీరు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. విజ‌య్ చిల్లా, శ‌శిదేవిరెడ్డి `భ‌లే మంచి రోజు` మూవీతో 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ని ప్రారంభించారు. ఇందులో సుధీర్‌బాబు హీరో. మ‌ళ్లీ తాజా చిత్రాన్ని సుధీర్‌బాబుతో నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ న‌వంబ‌ర్ నుంచి ప్రారంభం కానుంది