బ‌యోపిక్‌పై క్లారిటీ ఇచ్చిన సుధీర్‌బాబు!


బ‌యోపిక్‌పై క్లారిటీ ఇచ్చిన సుధీర్‌బాబు!
బ‌యోపిక్‌పై క్లారిటీ ఇచ్చిన సుధీర్‌బాబు!

తెలుగు తెర‌పై బ‌యోపిక్‌ల ప‌రంప‌ర `మ‌హాన‌టి`తో మొద‌లైన విష‌యం తెలిసిందే. `మహాన‌టి` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో ఇదే త‌ర‌హా జీవిత క‌థ‌ల‌ ప‌రంప‌ర మొద‌లైంది. ఇదే జాబితాలో హైద‌రాబాదీ బ్యాడ్మింట‌న్ కోచ్ పుల్లెల గోపీచంద్ జీవిత క‌థ ఆధారంగా ఓ చిత్రాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. గ‌త కొన్ని నెల‌లుగా ఈ వార్త వినిపిసస్తూనే వుంది కానీ మేక‌ర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

పుల్లెల గోపీచంద్ పాత్ర‌లో హీరో సుధీర్‌బాబు న‌టించ‌నున్నారు. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్‌కు చెందిన ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ నిర్మించ‌డానికి గ‌త కొన్ని నెల‌లుగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. తాజాగా ఈ సినిమాపై హీరో సుధీర్‌బాబు అఫీ2ఇయ‌ల్‌గా ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇటీవ‌ల బ‌యోపిక్ కోసం బ్యాడ్మింట‌న్ లో మ‌రిన్ని మెళ‌కువ‌లు నేర్చుకుంటున్నాన‌ని వెల్లించిన సుధీర్‌బాబు తాజాగా పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్ ఎప్పుడు మొద‌ల‌య్యేది చెప్పేశాడు. లాక్‌డౌన్ త‌రువాత మొద‌లుపెట్టాల‌నుకుంటున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న మేక‌ర్స్ నుంచి త్వ‌ర‌లోనే వెలువ‌డే అవ‌కాశం వుంది. హీరో నానితో క‌లిసి సుధీర్‌బాబు న‌టిస్తున్న `వి` చిత్రం లాక్‌డౌన్ త‌రువాత రిలీజ్ కాబోతోంది.