రష్మీనే తన లైఫ్ అంటోన్న సుధీర్


Sudigali Sudheer opines about Rashmi Gautham
Sudigali Sudheer opines about Rashmi Gautham

సుడిగాలి సుధీర్.. తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు. పెద్ద పేరున్న సినిమాలు చేయకపోయినా, బుల్లితెరపై ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నాడు సుధీర్. ప్రస్తుతం జబర్దస్త్, ఢీ, పోవే పోరా షో లు చేస్తూ అత్యంత బిజీగా గడుపుతున్న సుధీర్ కు లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఏడేళ్లుగా జబర్దస్త్ లో అప్రతిహితంగా కొనసాగుతున్న సుధీర్.. రష్మీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. రష్మీ నా లైఫ్ అని చెప్పి అందరినీ ఒక్క క్షణం షాక్ కు గురి చేసాడు.

నిజానికి సుధీర్ అనే పేరు వినిపించగానే రష్మీ గుర్తువస్తుంది. అలాగే రష్మీ టాపిక్ వస్తే అందులో కచ్చితంగా సుధీర్ గురించి ప్రస్తావన వస్తుంది. ఇంతలా అందరినీ ఈ జంట ఆకట్టుకుంది. వీరిద్దరూ కలిసి చేయకుండా షో చూడడం కొంచెం కష్టమే. అందుకే రష్మీ యాంకర్ గా ఉన్న ఎక్ట్రా జబర్దస్త్ లోనే సుధీర్ స్కిట్స్ చేస్తుంటాడు. కావాలనే ఢీ డ్యాన్స్ షో కు వీరిద్దరినీ మెంటార్స్ గా పెట్టారు. ప్రస్తుతం నడుస్తోన్న ఢీ లో వీరిద్దరూ ఒక టీమ్. షోస్ డిజైన్ చేసినప్పుడు కూడా వీరిద్దరి మధ్యా ఏదో ఉందనే తరహాలోనే చేస్తారు. ఈటివి వారు అయితే ఒక పండగ సందర్భంగా వీరిద్దరికీ పెళ్లి చేసినట్లుగా ఒక కార్యక్రమం కూడా నడిపించారు. అలాగే వీరిద్దరూ కూడా తమ మధ్య ఏదో నడుస్తోందనే తరహాలోనే ప్రవర్తిస్తుంటారు. అయితే అదంతా షో వరకే. కేవలం ఆన్ స్క్రీన్ లోనే తమ మధ్య కెమిస్ట్రీ ఉంటుందని చెప్తున్నాడు సుధీర్.

మరి రష్మీ నా లైఫ్ అన్న స్టేట్మెంట్ ఏమిటంటే దానికి ఒక లాజికల్ ఆన్సర్ ఇచ్చాడు. రష్మీ లేకపోతే సుధీర్ అనేవాడు ఈ స్థాయిలో ఉండేవాడు కాదని, సుధీర్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు రష్మీ, అలాగే జనాలు ఈరోజు తన గురించి మాట్లాడుకుంటున్నారు, తనకు ఫ్యాన్స్ అంటున్నారు అంటే దానికి ప్రధాన కారణం రష్మీనే అని అంటున్నాడు సుధీర్. తన సక్సెస్ లో మేజర్ క్రెడిట్ ఆమెకే వెళుతుందని, అందుకనే ఆమెకు ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్తున్నాడు సుధీర్.

రష్మీ విషయంలో పర్సనల్ గా తన అభిప్రాయం చెప్పమని అడిగినప్పుడు, ఆమె వ్యక్తిగత విషయాలు తెలిసాక, ఆమె ఎన్ని ఇబ్బందులు పడి ఈ స్టేజ్ కు వచ్చింది, ఆమెకు ఎదురైన అడ్డంకులు ఏంటి అన్నవి తెలిసాక ఆమెపై ఇష్టం కన్నా గౌరవం కలిగిందని చెప్తున్నాడు. జబర్దస్త్ నుండి నాగబాబు వెళ్లిపోయారు కదా, మరి మీరు కూడా వెళ్ళిపోతారా అన్న ప్రశ్నకు, ఏడేళ్లుగా జబర్దస్త్ చేస్తున్నానని, ఇంతకు ముందు కూడా బయట నుండి అవకాశాలు వచ్చాయని, ఇక ముందు కూడా వస్తాయని, ఒకవేళ తనకు వెళ్ళాలి అనిపించినా మల్లెమాల వాళ్ళు వద్దంటే వెళ్లాలని విచిత్రమైన సమాధానం ఇచ్చాడు సుధీర్.