సుడిగాలి సుధీర్ ని రిజెక్ట్ చేశా: హీరోయిన్


Sudigali Sudheer rejected by heroine
Sudigali Sudheer rejected by heroine

పలు సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధాన్య బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లవుతున్నా ఇంకా సరైన ఆఫర్స్ దక్కించుకోవడం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే హీరోయిన్ గా క్లిక్కయ్యేందుకు ప్రయత్నాలు చేసింది. ఇకపోతే అమ్మడు సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమా చేసింది. ఆ సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోంది.

 జబర్దస్త్ ఫెమ్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ఈ సినిమాపై ధాన్య బాలక్రిష్ణ షాకింగ్ కామెంట్ చేసింది. “మొదట సినిమాలో నటించాలని నిర్మాత దర్శకులు కోరినప్పుడు హీరో పేరు విని రిజెక్ట్ చేశాను. ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లవుతోంది. మళ్ళీ కొత్త హీరోతో వర్క్ చేయడం ఎందుకు అని.. సినిమా చేయకపోవడమే బెటర్ అని నిర్మాతలకి కూడా చెప్పాను. ఆ విషయం మా ఫ్రెండ్స్ కి కూడా చెప్పాను.
కానీ వాళ్ళంతా షాక్ అయ్యారు. ఎందుకు రిజెక్ట్ చేశావ్. సుధీర్ అంటే మాకు చాలా ఇష్టం. అతనికి బయట మాంచి క్రేజ్ ఉంది. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకు. ఆ సినిమా చేసి తీరాలి అని చెప్పడంతో సుధీర్ కి మంచి క్రేజ్ ఉందని సినిమా చేయడానికి ఒప్పుకున్నా. సుధీర్ మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అతను ఎప్పుడో హీరో అయిపోయాడు. ఈ సినిమాతో అతనికి మరింత క్రేజ్ వస్తుంది. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను కమర్షియల్ ఏలిమెంట్స్ మిస్ అవ్వకుండా చాలా అద్భుతంగా తెరకెక్కించారని ధాన్య బాలకృష్ణ వివరణ ఇచ్చారు.