స్టార్ డైరెక్ట‌ర్ 12 కోట్ల విల్లా కొన్నారా?స్టార్ డైరెక్ట‌ర్ 12 కోట్ల విల్లా కొన్నారా?
స్టార్ డైరెక్ట‌ర్ 12 కోట్ల విల్లా కొన్నారా?

మెగా ప‌వ‌న్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన `రంగ‌స్థ‌లం` మూవీతో సుకుమార్ కెరీర్ కొత్త మ‌లుపు తిరిగింది. ప్ర‌స్తుతం ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఫార్మాట్‌లో సుకుమార్ తెర‌కెక్కిస్తున్న చిత్రం `పుష్ప‌`. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా మైత్రీ మూవీమేక‌ర్స్‌తో పాటు ముత్యంశెట్టి మీడియా నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే మారేడుమిల్లి డీప్ ఫారెస్ట్‌లో మొద‌లైంది.

అల్లు అర్జున్ పాల్గొన‌గా ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌ని ఫారెస్ట్ నేప‌థ్యంలో చిత్రీక‌రిస్తున్నారు. ఊర‌మాస్ లుక్‌లో క‌నిపిస్తున్న బ‌న్నీ లుక్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. ఇదిలా వుంటే ఈ చిత్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ 12 కోట్ల‌తో విల్లాని కొండాపూర్‌లోని ప్రైమ్‌ ఏరియాలో తీసుకున్నార‌ని తెలిసింది. ఇటీవ‌లే గృహ ప్ర‌వేశం కూడా చేశార‌ట‌. `పుష్ప‌` షూటింగ్‌కి బ్రేకిచ్చి హైద‌రాబాద్ చేరుకున్న సుకుమార్ కొత్త విల్లాలోకి ఎంట్రీ ఇచ్చార‌ట‌. ఈ గృహ ప్ర‌వేశానికి సంబంధించిన పూజ‌లో హీరో బ‌న్నీతో పాటు టీమ్ మెంబ‌ర్స్‌.. ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా పాల్గొన్న‌ట్టు తెలిసింది.

మ‌హేష్ బాబు ఏఎంబీ సినిమాస్‌కి ద‌గ్గ‌ర‌లోనే సుకుమార్ విల్లా వుంటుంద‌ట‌. అత్యంత ఖ‌రీదైన గేటెడ్ క‌మ్యూనిటిలో ఈ విల్లాని సుకుమార్ సొంతం చేసుకున్న‌ట్టు చెబుతున్నారు. సుకుమార్ 12 కోట్ల విల్లా ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.