విజ‌య్ దేవ‌ర‌కొండ- సుకుమార్ ప్రాజెక్ట్ ఆగిపోలేదు!

విజ‌య్ దేవ‌ర‌కొండ- సుకుమార్ ప్రాజెక్ట్ ఆగిపోలేదు!
విజ‌య్ దేవ‌ర‌కొండ- సుకుమార్ ప్రాజెక్ట్ ఆగిపోలేదు!

టాలీవుడ్ సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ – సుకుమార్‌ల క‌ల‌యిక‌లో అల్లు అర్జున్ స్నేహితుడు కేదార్ సెల‌గ‌మ్‌శెట్టి ఫాల్క‌న్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఓ భారీ పాన్ ఇండియా మూవీని నిర్మించాల‌ని గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు దీనికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ లేదు. హీరో విజ‌య్ దేవ‌ర‌ర‌కొండ `లైగ‌ర్‌` షూటింగ్ బిజీలో వున్నారు.

స్టాన్ డైరెక్ట‌ర్ సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ఊర‌మాస్ హైవోల్టేజ్ ఎంట‌ర్‌టైన‌ర్ `పుష్ప‌` మూవీ షూట్‌లో బిజీగా వున్నారు. ఇదిలా వుంటే సుకుమార్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల మూవీ ఆగిపోయింద‌ని ఇట‌లీవ‌ల పుకార్లు మొద‌ల‌య్యాయి. ఈ వార్త‌ల‌పై నిర్మాణ సంస్థ సోమ‌వారం స్పందించింది. విజ‌య్‌, సుక్కుల ప్రాజెక్ట్ పై వ‌స్తున్న పుకార్ల‌ని ఖండించింది.

ఈ ప్రాజెక్ట్‌పై వ‌స్తున్న పుకార్ల‌న్నీ అవాస్త‌వాల‌ని, విజ‌య్ దేవ‌ర‌కొండ – సుకుమార్ ల కాంబోలో రూపొంద‌నున్న సిపిమా ముందు అనుకున్న ప్ర‌కార‌మే సెట్స్ పైకి వెళుతుందని ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం విజ‌య్ `లైగ‌ర్` షూటింగ్‌లో బిజీగా వున్నారు. సుకుమార్ `పుష్ప‌` చేస్తున్నారు. ఈ ఇద్ద‌రి ప్రాజెక్ట్స్ పూర్తి కాగానే మా మూవీ అనుకున్న ప్ర‌కార‌మే సెట్స్ పైకి వెళుతుంద‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది.