`పుష్ప‌` కోసం సుకుమార్ అంత డిమాండ్ చేశారా?

`పుష్ప‌` కోసం సుకుమార్ అంత డిమాండ్ చేశారా?
`పుష్ప‌` కోసం సుకుమార్ అంత డిమాండ్ చేశారా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `అల వైకుంఠపుర‌ములో` గ‌త ఏడాది ప్రా‌రంభంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకుని మాంచి జోష్ మీదున్నారు. అదే జోష్‌తో టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌స్తుతం `పుష్ప‌` చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, మిందీ భాష‌ల్లో ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్నారు.

ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ మారేడుమిల్లి స‌మీప గ్రామాల్లో జ‌రుగుతోంది. ఆర్య‌, ఆర్య‌2 చిత్రాల త‌రువాత ముచ్చ‌ట‌గా మూడ‌వ సారి క‌లిసి ఈ ఇద్ద‌రు వ‌ర్క్ చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై బారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే ఇందులో బ‌న్నీ ఊర‌మాస్ పాత్ర‌లో లారీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు. 1980 కాలం నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం కోసం సుకుమార్ భారీ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నార‌ని వినిపిస్తోంది.

ఈ చిత్రం కోసం సుకుమార్ ఏకంగా 23 కోట్లు డిమాండ్ చేస్తున్నార‌ట‌. ఈ స్థాయిలో ద‌క్షిణాదిలో పారితోషికం తీసుకుంటున్న ద‌ర్శ‌కుడిగా సుకుమార్ రికార్డు సృష్టిస్తున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. పూరి 12, బోయ‌పాటి 12 నుంచి 13.. త్రివిక్ర‌మ్ లాభాల్లో వాటాతో క‌లిపి 20కి మించి తీసుకుంటున్నారు.