చిరంజీవి తో సినిమా చేయడం లేదట


sukumar denied rumours మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయాలనీ ప్రతీ ఒక్కరికి ఉంటుంది అలాగే నాకు అయితే జీవిత లక్ష్యం కూడా కానీ ఇప్పుడైతే చిరంజీవి తో ఎలాంటి సినిమా చేయడం లేదని స్పష్టం చేసాడు దర్శకులు సుకుమార్ . గతకొంత కాలంగా సుకుమార్ చిరంజీవి తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని , రాంచరణ్ సుకుమార్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చాడని రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు స్పందించి ఆ వార్తలను ఖండించాడు .

 

చరణ్ హీరోగా నటించిన రంగస్థలం చిత్రానికి సుకుమార్ దర్శకుడు అన్న విషయం అందరికీ తెలిసిందే . ఈనెల 30న భారీ ఎత్తున రంగస్థలం చిత్రం విడుదల కానుంది . చరణ్ – సమంత విభిన్న పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి .