సుక్కూ, దేవి పని పూర్తి చేసేసారు


సుక్కూ, దేవి పని పూర్తి చేసేసారు
సుక్కూ, దేవి పని పూర్తి చేసేసారు

దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు.  ఒకపక్క తన ట్యూన్స్ పై విమర్శలు రావడం, మరో పక్క తన ప్రధాన కాంపిటీటర్ థమన్ చార్ట్ బస్టర్ మ్యూజిక్ తో దూసుకుపోతుండడంతో దేవికి ఇబ్బందులు తప్పట్లేదు. దానికి తోడు తనతో ఇంతకాలం పనిచేసిన సంగీత దర్శకులు కూడా వేరే ఆప్షన్స్ చూసుకుంటుండడంతో దేవి ఒత్తిడిలో ఉన్నాడు. ఎలాగైనా ఇప్పుడొక క్రేజీ చార్ట్ బస్టర్ కొట్టి తన స్థానం పదిలమని నిరూపించుకోవాలి. ఉప్పెనలో విడుదలైన రెండు సాంగ్స్ తో ఇంప్రెస్ చేసినా కానీ ఒక టాప్ హీరోకు మెమరబుల్ ఔట్పుట్ ఇస్తే దాని లెవెల్ వేరే రేంజ్ లో ఉంటుంది.

ఇందుకోసం దేవి ముందున్న అవకాశం అల్లు అర్జున్ మూవీ. నిజానికి అల్లు అర్జున్, సుకుమార్ తో సినిమా చేస్తున్నప్పుడు మొదట దేవి అంటే బన్నీ వద్దన్నాడట. థమన్ ను తీసుకుందామని సూచించాడట. కానీ సుక్కూకి దేవి అంటే ఉండే నమ్మకం వేరే లెవెల్. ఇప్పటివరకూ సుక్కూ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు దేవి. సో తననే పుష్ప చిత్రానికి కూడా కంటిన్యూ చేసాడు. షూటింగ్ మొదలయ్యే లోపు లాక్ డౌన్ వచ్చింది.

ఇక లాక్ డౌన్ దేవి పూర్తిగా పుష్ప మీదే దృష్టి పెట్టినట్లు సమాచారం. సుక్కూతో నిరంతరం ఆన్లైన్ లోనే టచ్ లో ఉంటూ దేవి ట్యూన్స్ ను ఫైనల్ చేసేసుకున్నాడట. ఇక దానికి ఫైన్ ట్యూనింగ్ ఇచ్చి సెట్ చేసుకుంటే సరిపోతుంది. సుక్కూ-దేవి కాంబినేషన్ లోనే బెస్ట్ చార్ట్ బస్టర్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు ఇద్దరూ.