రంగస్దలం సెట్లొ “సంత” ఫస్ట్ లుక్ లాంఛ్ చెసిన సుకుమార్


Sukumar launches Santha first look at Rangasthalam set

సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం “సంత”. మట్టి మనుషుల ప్రేమకథ అనేది ట్యాగ్ లైన్.
నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకుడు. ఓ సంత నేపధ్యంలొ ప్రేమకథగా ఫీల్ గుడ్ ఎంటర్ టైన్ మెంట్ జొనర్ లొ తెరకెక్కుతొన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రంగస్దలం సెట్ లొ దర్శకులు సుకుమార్ లాంఛ్ చెశారు.‌

ఈ సందర్బంగా సుకుమార్ మాట్లాడుతూ.. గ్రామీణ నేపధ్యంలో ఓ చక్కని ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా తీసిన “సంత” ప్రేక్షకులను ఆకట్టుకొవాలి. గొరెటి వెంకన్న గారు ఓ లెజెండ్ ఆయన ఈ సినిమాలో రాసిన పాట ఓ అద్బుతం. సంత సక్సెస్ కావాలని చిత్రయూనిట్ కు విషెష్ ను తెలిపారు.

దర్శకుడు ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ.. సంత చిత్రీకరణ పూర్తయింది. హైదరాబాద్, వరంగల్ పరిసర ప్రాంతాల్లొ పాటల చిత్రీకరణ చెశాము. రంగస్ధలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సుకుమార్ గారు మా చిత్ర ఫస్ట్ లుక్ ను లాంఛ్ చెయటం ఆనందంగా ఉంది. త్వరలొనె పాటలను విడుదల చెస్తామన్నారు.

కిన్నెర, మధుమణి, జబర్దస్త్ ఫణి, ప్రసన్న, ఆర్.ఎస్.నందా, దుర్గేష్ తదితరులు నటించిన
ఈ చిత్రానికి మాటలు: ఎస్.కె.అనీఫ్, డా.పసునూరి రవీందర్, ఫెట్స్ : రవి
పాటలు : గోరెటీ వెంకన్న,కాసర్ల శ్యామ్,మౌనశ్రీ మల్లిక్, మాట్లా తిరుపతి, డిఓపి: ఫణీంద్ర వర్మ అల్లూరి, నిర్మాత : శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి, కథ- కథనం- సంగీతం- దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్..