దేవిని పిండేస్తున్న సుకుమార్


దేవిని పిండేస్తున్న సుకుమార్
దేవిని పిండేస్తున్న సుకుమార్

గతంలో ఒక ఆడియో వేదిక మీద ఒక చిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. లెజండ్ సినిమా సక్సెస్ మీట్ లో దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ తాను మంచి మ్యూజిక్ కోసం దేవిని చిత్ర హింసలు పెట్టానని, దేవి దగ్గరనుండి పిండి ఔట్పుట్ ను సాధించుకున్నానని కొంచెం గొప్పగానే చెప్పుకున్నాడు. సాధారణంగా ఇలాంటి స్పీచ్ లప్పుడు చూసీ చూడనట్లు వదిలేస్తారు చాలా మంది. అయితే దేవి ఆ సందర్భంలో అలా ఏం వదల్లేదు. తాను ఏం గేదెనో, అవునో కాదు పిండడానికి, ఒక సినిమా ఒప్పుకుంటే దానికి తగ్గ ఔట్పుట్ ఇవ్వడంలో ముందుంటాను. ముందు నేనే కంప్రమైజ్ కాను అంటూ బోయపాటికి గట్టి ఝలక్కే ఇచ్చాడు. అయితే ఆ తర్వాత ఇద్దరూ మళ్ళీ కలిసిపోయారు లెండి, అది వేరే విషయం. అయితే అప్పుడు పిండుకుని పని చేయించుకున్నాను అంటే దేవికి అంత కోపం వచ్చేసింది. ఎందుకంటే అప్పట్లో దేవి టైమ్ అలా ఉండేది. తను ఏ మ్యూజిక్ కొడితే అదే సూపర్ డూపర్ హిట్ అయిపోయేది.

అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎప్పుడూ లేనన్ని విమర్శలు దేవి శ్రీ ప్రసాద్ ఈ మధ్య కాలంలో ఎదుర్కొంటున్నాడు. దేవి మీద ఎప్పుడూ ట్రోల్స్ అన్నవి లేవు. కానీ ఇప్పుడు దేవి పైనే ఎన్నో ట్రోల్స్ వస్తున్నాయి. గతంలో అతనితో పనిచేసిన దర్శకులు కూడా ఇప్పుడు దేవికి ముఖం చాటేస్తున్నారు. అగ్ర దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడో దేవిని దూరం పెట్టేసాడు. అలాగే తన కెరీర్ మొదటి నుండి దేవితోనే పనిచేస్తూ వచ్చిన కొరటాల శివ కూడా ఇప్పుడు చిరంజీవి సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ తో పనిచేయట్లేదు. మెలోడీ బ్రహ్మ మణిశర్మను ఈ ప్రాజెక్ట్ కు తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.

గతేడాది నుండి దేవి నుండి వచ్చిన మ్యూజిక్ ఆల్బమ్స్ రొటీన్ గా ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. ఎంసీఏ, హలో గురూ ప్రేమ కోసమే, ఎఫ్ 2, వినయ విధేయ రామ, మహర్షి.. ఇలా అన్ని ఆల్బమ్స్ కూడా యావరేజ్ గానే నడిచాయి. ఈ నేపథ్యంలోనే దర్శకులు దూరం జరుగుతూ వచ్చారన్నది తెలుస్తోంది. అయితే ఎంత మంది దూరం పెట్టినా క్రియేటివ్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న సుకుమార్ మాత్రం దేవిని వదల్లేదు. అల్లు అర్జున్ తో తాను చేయబోయే సినిమాకు దేవినే సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. సుకుమార్ – దేవి కాంబినేషన్ ఎవర్ గ్రీన్. వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన పాటల్లో ఒక్క ప్లాప్ కూడా లేదంటే చూడండి ఆల్బమ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో. దీనికి కారణం సుకుమార్ మ్యూజిక్ సెన్స్ అని తెలుస్తోంది. దేవి ఇచ్చే ట్యూన్స్ ను సుక్కూ అంత ఈజీగా ఓకే చేయడట. ఒక్క పాటకు కనీసం 20 నుండి 30 ట్యూన్స్, ఒక్కోసారి 50 ట్యూన్స్ దాకా కౌంట్ వెళ్ళిపోతుందని తెలుస్తోంది. అంత డెడికేషన్ గా ఇద్దరూ కలిసి వర్క్ చేస్తారు కాబట్టే ఔట్పుట్ ఆ రేంజ్ లో వస్తుంది. అల్లు అర్జున్ తో వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న సినిమాకు అదిరిపోయే రేంజ్ లో పాటలు సమకూరినట్లు తెలుస్తోంది.