మెగా రీమేక్.. సుకుమార్ డ్రాప్?


Sukumar plans to movie with Mega hero
Sukumar plans to movie with Mega hero

మెగాస్టార్ చిరంజీవి సైరా అనంతరం కొరటాల శివతో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. పూజా కార్యక్రమాలతో సినిమాను సెట్స్ పైకి తెచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఈ ప్రాజెక్ట్ అనంతరం వెంటనే మరో సినిమాను కూడా స్టార్ట్ చేయాలని అనుకున్నారు. అందుకు రామ్ చరణ్ కూడా బ్యాక్ గ్రౌండ్ లో తన టీమ్ తో చర్చలు జరిపారు. రీసెంట్ గా చరణ్ లుసిఫర్ రిమేక్ హక్కుల్ని దక్కించుకున్న విషయం తెలిసిందే.

అయితే అదే కథను మెగాస్టార్ రీమేక్ చేయాలని రామ్ చరణ్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. అందుకు డైరెక్టర్ సుకుమార్ తో  కూడా ముందే ఓ మాట అనుకున్న చెర్రీ బన్నీతో సినిమా అయిపోగానే లుసిఫర్ ని తెలుగులో సరికొత్తగా తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ సుకుమార్ ఆ రీమేక్ కథను తెరకెక్కించడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సుక్కు ఎప్పుడు రీమేక్ కథలను టచ్ చేయలేదు. సొంత కథలతోనే తనకి తెలిసిన హాలీవుడ్ ట్రిక్స్ తో స్క్రీన్ ప్లే సెట్ చేసుకునే సుకుమార్ ఆ మలయాళం కథను ఇష్టపడటం
లేదట.
అవసరమైతే మరో కథను మెగాస్టార్ కోసం సొంతంగా రాస్తాను గాని రిమేక్ కథలను టచ్ చేయలేను అని సుక్కు చరణ్ కి సున్నితంగా వివరణ ఇచ్చాడట. మొత్తానికి లుసిఫర్ రీమేక్ నుంచి సుకుమార్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక చరణ్ కూడా దాని గురించి ఇప్పుడే ఆలోచించకుండా కొరటాల శివ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టాక ఆలోచిద్దామని తన నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టినట్లు టాక్.