“మేము మృగాళ్ళం, మమ్మల్ని నమ్మొద్దు” అంటున్న సుకుమార్


Sukumar-says-Please-dont-trust-on-us-4
Sukumar-says-Please-dont-trust-on-us-4

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఎమోషనల్ అయిపోయాడు. గత కొద్ది రోజులుగా అందరినీ కలిచివేసిన ప్రియాంక రెడ్డి రేప్ అండ్ మర్డర్ విషయంపై స్పందించాడు సుకుమార్. ఇలాంటి చర్యకు మనందరం బాధ్యులమే. ఆ నేరస్థులు కూడా మనలోనుండి వచ్చిన వారే. పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు అన్న విషయాలు గురించి అందరూ తెలుసుకోవాలి. ఈరోజుల్లో ఇంతలా నేరాలు జరిగేవి కాదు, ఈరోజుల్లో మరీ ఎక్కువైపోయాయి. పోర్న్ సైట్స్ విచ్చలవిడిగా అందుబాటులో ఉండడం కూడా దీనికి ఒక కారణంగా చెప్పొచ్చు. అసలు ఈ విషయం తెలీగానే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు, ప్రియాంక ఫ్యామిలీకి నా సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను, we are very sorry andi అని చెప్పాడు సుకుమార్.

ఇంకా ఆరోజు ఇన్సిడెంట్ గురించి కొంచెం అనలైజ్ చేసే ప్రయత్నం చేసాడు. అందరూ కూడా ప్రియాంక రెడ్డి 100 కు కాల్ చేసి ఉండాల్సింది కదా అని ఇప్పుడు అంటున్నారు. కానీ ఒకసారి కాల్ లో ఆ అమ్మాయి వాయిస్ వింటే చాలా సెన్సిటివ్ గా ఉంది. ఆ అమ్మాయి కాల్ చేయడానికి భయపడి ఉండవచ్చు లేదా నలుగురు అన్నలు తనకోసం సహాయం చేస్తున్నారు కదా అని వాళ్ళను నమ్మింది. ఒకవేళ 100కు ఫోన్ చేసి పోలీసులు వస్తే అదేంటక్కా నీకు సహాయం చేస్తుంటే ఇలా చేసావ్ అంటారేమోనని ఆలోచించి వదిలేసింది. కానీ అదే ఆ అమ్మాయి చేసిన తప్పయింది. అమ్మాయిలు, అబ్బాయిలను అంతలా నమ్ముతారు. కాబట్టి చెప్తున్నా మీరు ఎవరినీ నమ్మకండి. మగాళ్లను అస్సలు నమ్మకండి. మేము మగాళ్ళం కాదు, మృగాళ్ళం. మమ్మల్ని నమ్మొద్దు. మీరు ఎవరూ నమ్మొద్దు. అది మీ అన్న అయినా, తమ్ముడు అయినా కూడా నమ్మకండి. ప్రపంచం అలా ఉంది. ముందు మీకు ఏదైనా ఆపద ఉందనిపిస్తే ఏమాత్రం మొహమాట పడకుండా 100 కు కాల్ చేయండి. తర్వాతి సంగతి తర్వాత. వాడు మరీ అంత మంచివాడు అయితే సారీ చెప్పుకోవచ్చు. ఎవరినైనా అనుమానపడటానికి ఆలోచించకండి. అనుమానంతోనే బ్రతకండి. అలా అయితేనే మీరు సేఫ్ గా ఉండగలరు అని చెప్పాడు సుకుమార్.

తన మాటల్ని బట్టి చూస్తుంటే సుకుమార్ ను ఈ సంఘటన బాగా కలిచివేసిందని చెప్పొచ్చు. ఆ దారుణం చేసిన నలుగురిని 14 రోజులు రిమాండ్ కు పంపిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో వాళ్లకి కఠినమైన శిక్షలు పడాలని అందరూ కోరుకుంటున్నారు. వీలైనంత త్వరలో ఆ రాక్షసులను శిక్షించాలని పట్టుబడుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే సుకుమార్ రంగస్థలం వంటి భారీ హిట్ తర్వాత బాగా గ్యాప్ తీసుకుని అల్లు అర్జున్ తో సినిమాకు కమిట్ ఐన విషయం తెల్సిందే. రీసెంట్ గా ఈ సినిమాకు ముహూర్తం జరుగగా, జనవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుందని ఇప్పటికే సమాచారమందింది. రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ అయిందన్న విషయం తెల్సిందే.