బ‌న్నీ బ‌ర్త్ డే గిఫ్ట్ రెడీ చేస్తున్న సుకుమార్‌!


బ‌న్నీ బ‌ర్త్ డే గిఫ్ట్ రెడీ చేస్తున్న సుకుమార్‌!
బ‌న్నీ బ‌ర్త్ డే గిఫ్ట్ రెడీ చేస్తున్న సుకుమార్‌!

అల్లు అర్జున్ – సుక్కుల క‌ల‌యిక‌లో ముచ్చ‌ట‌గా మూడవ చిత్రం రాబోతోంది. ఇటీవ‌ల `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ప్రప్తుతం క‌రోనా వైర‌స్ కార‌ణంగా లాక్ డౌన్ న‌డుస్తుండ‌టంతో ఈ స‌మ‌యాన్ని మేకోవ‌ర్ కోసం ఉప‌యోగిస్తున్నాడు. సుకుమార్ తెర‌కెక్కించ‌నున్న చిత్రంలో లారీ డ్రైవ‌ర్‌గా ఊర‌మాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే.

ఈ పాత్ర కోసం చిత్తూరు యాస నేర్చుకుంటున్న బ‌న్నీ అన్ని విధాలా త‌న పాత్ర కోసం సిద్ధ‌మ‌వుతున్నాడ‌ట‌. `రంగ‌స్థ‌లం` చిత్రంతో మెగా ప‌వ‌ర్‌స్టార్‌ని చిట్టిబాబుగా కొత్త కోణంలో ఆవిష్క‌రించిన సుకుమార్ తాజా చిత్రంలోనూ అల్లు అర్జున్‌ని కూడా స‌రికొత్త పాత్ర‌లో చూపించ‌బోతున్నాడ‌ట‌. త్వ‌ర‌లో న‌ల్ల‌మ‌ల‌లో రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ప్రారంభించ‌బోతున్నారు.

ఇటీవల అల్లు అర్జున్ లుక్ అంటూ బ‌య‌టికి వ‌చ్చిన ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. దీంతో సుకుమార్ బ‌న్నీ ఫ‌స్ట్‌లుక్‌తో పాటు మూవీ టైటిల్‌ని ఈ నెల 8న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారట‌. ఆ రోజు బ‌న్నీ పుట్టిన రోజు కావ‌డంతో టైటిల్‌తో పాటు బ‌న్నీ లుక్‌ని రిలీజ్ చేస్తే బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన‌ట్టుగా వుంటుంద‌ని సుకుమార్ ప్లాన్ చేస్తున్న‌ట్టు టాక్‌.  ర‌ష్మిక‌తో ఇటీవ‌లే లుక్ టెస్ట్ ని నిర్వ‌హించిన సుక్కు బ‌న్నీపై కూడా అదే త‌ర‌హా లుక్ టెస్ట్‌ని చేసిన‌ట్టు చెబుతున్నారు.