‘వాల్మీకి’లో సుకుమార్ రోల్ ఇదే


Sukumar role in Valmiki
Sukumar role in Valmiki

టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం వాల్మీకి సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. వరుణ్ తేజ్ నెగటివ్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో తమిళ హీరో అధర్వ కీలకపాత్రలో నటిస్తున్నాడు. మొదట ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేయాలనుకున్నా ఒక వారం వెనక్కి జరిపి సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నారు.

ఇటీవలే వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకర్షించాయి. ఇదిలా ఉంటే ఈ  సినిమాలో క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ అతిధి పాత్రలో కనిపించనున్న విషయాన్ని హరీష్ శంకర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఈ సినిమాలో అధర్వ దర్శకుడు అవ్వాలనుకునే పాత్రలో కనిపిస్తాడు. ఈ నేపథ్యంలో ఒక స్టార్ డైరెక్టర్ ను కలిసే సీన్ లో సుకుమార్ కనిపించనున్నారు.

మిక్కీ జె మేయర్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తుండగా, పూజ హెగ్డే కథానాయికగా కనిపించనుంది.