`పుష్ప‌` కోసం టెర్రిఫిక్ ప్లాన్ రెడీ!


`పుష్ప‌` కోసం టెర్రిఫిక్ ప్లాన్ రెడీ!
`పుష్ప‌` కోసం టెర్రిఫిక్ ప్లాన్ రెడీ!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా భారీ చిత్రాల నిర్మాణం ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. వైర‌స్ వ్యాప్తి రోజు రోజుకీ పెరుగుతున్న నేప‌థ్యంలో సినిమా షూటింగ్‌లు పెద్ద స‌మస్య‌గా మారాయి. ప‌రిమిత సిబ్బందితో ప్ర‌భుత్వం షూటింగ్‌లు చేసుకోవ‌చ్చ‌ని అనుమ‌తులు ఇచ్చినా చిన్న సినిమాలు, టీవీ సీరియ‌ల్స్ త‌ప్ప స్టార్ హీరోల చిత్రాలేవీ సెట్స్ పైకి రాలేదు. రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు. ప‌రిమిత సిబ్బందితో షూటింగ్ అసాధ్యం కాబ‌ట్టి అలా చేయ‌డం ఇష్టం లేకే స్టార్ హీరోలు బ‌య‌టికి రావ‌డం లేదు.

ఇదిలా వుంటే క‌రోనా వైర‌స్ రోజు రోజుకీ పెరిగిపోతున్న నేప‌థ్యంలో స్టార్ హీరో అల్లు అర్జున్ న‌టిస్తున్న `పుష్ప‌` టీమ్ షూటింగ్ కోసం టెర్రిఫిక్ ప్లాన్‌ని సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. అయితే అది ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ప్ర‌భుత్వం 30 నుంచి 40 మంది సిబ్బందితో మాత్ర‌మే షూటింగ్‌లు జ‌రుపుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది. కానీ `పుష్ప‌` టీమ్ మాత్రం ఇందుకు భిన్నంగా 200 మంది టీమ్‌తో షూటింగ్ చేయ‌డానికి ప‌క్కా ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది.

200 మంది టీమ్‌తో హైద‌రాబాద్ శివార్ల‌లోని అట‌వీ ప్రాంతంలో పూర్తి నియ‌మ నిబంధ‌న‌లు, జాగ్ర‌త్త‌ల‌తో షూటింగ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఓ రిసార్ట్ లాంటి ఏర్పాటు చేసి న‌టీన‌టుల‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌. త‌మ ప్లాన్‌ని ప్ర‌భుత్వానికి వివ‌రించి అనుమ‌తులు పొందాల‌న్న‌ది సుకుమార్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. ప్లాన్ వ‌ర్క‌వుట్ అయితే త్వ‌ర‌లోనే `పుష్ప‌` షూటింగ్ ప‌ట్టాలెక్క‌నుంద‌న్న‌మాట‌.