సుకుమార్ కు టఫ్ టార్గెట్ ఇచ్చిన బన్నీ


సుకుమార్ కు టఫ్ టార్గెట్ ఇచ్చిన బన్నీ
సుకుమార్ కు టఫ్ టార్గెట్ ఇచ్చిన బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు యమా జోష్ మీదున్నాడు. రీసెంట్ గా అల వైకుంఠపురములో చిత్రంలో అదిరిపోయే రేంజ్ లో సక్సెస్ సాధించాడు బన్నీ. ఈ సినిమా రికార్డులను తిరగరాసింది. బన్నీని తిరిగి టాప్ 5 లోకి చేర్చింది. దీంతో నెక్స్ట్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అల్లు అర్జున్ ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో తన తర్వాతి సినిమా ఉంటుందని ప్రకటించిన విషయం తెల్సిందే. గతేడాదే ఈ చిత్రాన్ని లాంచ్ చేయగా వివిధ కారణాల వల్ల షూట్ మొదలవ్వడానికి సమయం పడుతోంది. ఇప్పటికే సుకుమార్ ప్రీ ప్రొడక్షన్ పనులను ఓ కొలిక్కి తీసుకొచ్చేసాడు. కేరళ వెళ్లి అక్కడ 45 రోజుల భారీ షెడ్యూల్ కోసం లొకేషన్స్ ను ఫైనల్ చేసుకుని వచ్చాడు. అలాగే హీరోయిన్ రష్మికకు టెస్ట్ షూట్ పూర్తి చేసాడు. ఈ సినిమాలో రష్మిక లుక్ సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

ఐతే ఈ సినిమా షూట్ ఇప్పటికే మొదలవ్వాలి. మార్చ్ మొదటి వారంలోనే షూట్ మొదలవుతుందని చెప్పారు కానీ అల్లు అర్జున్ లుక్ ఇంకా ఫైనల్ కాకపోవడమే డిలేకు కారణమని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఈ సినిమాలో పొడుగు జుట్టు, గుబురు గెడ్డం, పెద్ద మీసాలతో కనిపిస్తాడని అంటున్నారు. ఈ లుక్ ఇంకా సరిగ్గా సెట్ కాకపోవడంతోనే షూట్ మొదలవ్వడానికి డిలే అవుతోంది.

అయితే షూట్ స్టార్ట్ డిలే అయినా కానీ విడుదలలో ఎటువంటి డిలే ఉండదని అంటున్నారు. ఎందుకంటే సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేసే ఆస్కారం లేదు. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ ను లాక్ చేసుకోగా, పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం కూడా ఆ పండక్కి వస్తుందని తేలిపోయింది. సో సంక్రాంతి మిస్ అయితే నెక్స్ట్ సమ్మర్ కే రావాలి. అంత డిలే అంటే కష్టం కాబట్టి ఎలాగైనా ఈ ఏడాదే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే సుకుమార్ షూట్ ను నెమ్మదిగా కానిస్తాడు. కాబట్టి కచ్చితంగా ఈ నిర్ణయం ఈ క్రియేటివ్ దర్శకుడికి సవాల్ వంటిదే.