తండ్రి కోసం త‌న‌య స్పెష‌ల్ గిఫ్ట్‌!


Sukumar's doughter special birth day treat
Sukumar’s doughter special birth day treat

విభిన్న‌మైన చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు సుకుమార్‌. లెక్క‌ల మాస్టారిగా పేరున్న ఆయ‌న ప్ర‌స్తుతం అల్లు అర్జున్ హీరోగా ఓ మాస్ మ‌సాలా చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఆయ‌న త‌న 50వ పుట్టిన రోజుని జ‌రుపుకున్నారు. తండ్రికి స్పెష‌ల్ గిఫ్ట్ ఇవ్వాల‌ని ప్లాన్ చేసిన ఆయ‌న కుమార్తె సుక్రితి ప్ర‌త్యేకంగా సుకుమార్ కోసం ఓ పాట పాట‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది.

బుధ‌వారం సుక్రితి పుట్టిన రోజు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని సుక్రితి పాడిన పాట‌ని దేవి శ్రీ‌ప్ర‌సాద్ సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల కోసం షేర్ చేశారు. హ్యపీయెస్ట్ మ్యూజిక‌ల్ డే టు సూప‌ర్ టాలెంటెడ్ లిటిల్ ఏంజిల్ సుకుమార్ డాట‌ర్‌ సుక్రితి సుకుమార్‌. సుకుమార్ బ‌ర్త‌డే కోసం సుక్రితి పాడిన పాట‌ని ఆమె బ‌ర్త‌డే రోజున మీ ముందుకు తీసుకొస్తున్నా. అంద‌రికి న‌చ్చుతుంద‌ని, ఆమెని ఆశీర్వ‌దిస్తార‌ని ఆశిస్తున్నాను` అని దేవి శ్రీ‌ప్ర‌సాద్ బుధ‌వారం ట్వీట్ చేశారు.

సుక్రితి పాడిన పాట సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్స్ సుక్రితి టాలెంట్‌కు ఫిదా అయిపోయి ఔరా అంటూ అభినంద‌న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.