అల్ల‌రి న‌రేష్‌.. సుమంత్ 19న పోటీప‌డుతున్నారు!

అల్ల‌రి న‌రేష్‌.. సుమంత్ 19న పోటీప‌డుతున్నారు!
అల్ల‌రి న‌రేష్‌.. సుమంత్ 19న పోటీప‌డుతున్నారు!

వెండితెర‌పై త‌న‌దైన అల్ల‌రితో సినీ ప్రియుల్ని క‌డుపుబ్బా న‌వ్విస్తుంటారు హీరో అల్ల‌రి న‌రేష్‌. గ‌త కొంత కాలంగా కామెడీ చిత్రాల్లో న‌టిస్తూ ఆక‌ట్టుకుంటున్న ఆయ‌న తాజాగా త‌న పంథా మార్చుకున్నారు. `నేను` త‌ర‌హాలో సీరియ‌స్ మూవీ `నాంది`తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో వేగేశ్న స‌తీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వ‌మి హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ ఏ త‌ప్పు చేయ‌ని ట్ర‌య‌ల్ ఖైదీగా క‌నిపించ‌నున్నారు.

ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్ర టీజ‌ర్‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ ఈ మూవీపై భారీ అంచ‌నాల్ని పెంచేసింది. ఈ మూవీకి సంబంధించిన కొన్ని స‌న్నివేశాల్లో హీరో అల్ల‌రి న‌రేష్ అర్థ్ర న‌గ్నంగా న‌టించిన దృశ్యాలు ఒళ్లు గ‌గుర్పొడిచేలా వున్నాయి. ఈ మూవీతో ఆయ‌న‌కు అవార్డు గ్యారెంటీ అంటున్నారు.

ఇదిలా వుంటే ఈ మూవీతో సుమంత్ పోటీప‌డుతున్నారు. ఆయ‌న న‌టిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ `క‌ప‌ట‌ధారి`. ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నందితా శ్వేతా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ , నాజ‌ర్‌, ప్రియ‌ద‌ర్శి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఓ చిన్నారి హ‌త్య మిస్ట‌రీ నేప‌థ్యంలో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగే చిత్ర‌మిది.