సుమంత్ అచ్చం ఏఎన్నార్ లాగే ఉన్నాడే


Sumanth look in NTR biopic

మహానటుడు అక్కినేని నాగేశ్వర్ రావు పుట్టినరోజు ఈరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ బయోపిక్ లోని ఏ ఎన్నార్ లుక్ ని రిలీజ్ చేసారు . అక్కినేని పాత్రలో ఆయన మనవడు సుమంత్ నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఎన్టీఆర్ బయోపిక్ లోని అక్కినేని లుక్ లో సుమంత్ అచ్చం తాతగారి లాగే ఉన్నాడు . ఒకదశలో చూస్తే పాతరోజుల్లోని అక్కినేనిని చూసినట్లుగానే ఉంది అంతగా మేకోవర్ అయ్యాడు సుమంత్ . అక్కినేని ఇంట్లోనే సుమంత్ పెరిగాడు , అసలు ఈ ఇద్దరూ తాతా మనవడు కానీ అంతకంటే ఎక్కువ అనుబంధం ఉంది అక్కినేని – సుమంత్ ల మధ్య .

సుమంత్ లుక్ రిలీజ్ కావడమే ఆలస్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . సుమంత్ లుక్ కి అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రేమికులంతా ఫిదా అవుతున్నారు . క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పటికే హాట్ కేక్ అయి కూర్చుంది . విద్యాబాలన్ , రానా , నందమూరి కళ్యాణ్ రామ్ , సుమంత్ ఇలా పలువురు చేరికతో బాలయ్య చిత్రానికి ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది . వచ్చే ఏడాది జనవరి లో విడుదల చేయడానికి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నాడు బాలయ్య . ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఎన్టీఆర్ చిత్రాన్నీ కొనుక్కోవడానికి బయ్యర్లు పోటీపడుతున్నారు .

English Title: Sumanth look in NTR biopic