ఎన్టీఆర్ బయోపిక్ లో ఆ హీరో నటించడం లేదట


sumanth not intrested on ntr biopicప్రతిష్టాత్మక చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ లో అక్కినేని నాగేశ్వర్ రావు పాత్రలో ఆయన మనవడు హీరో సుమంత్ నటించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ లో సుమంత్ నటించడం లేదని తెలుస్తోంది . ఎన్టీఆర్ – అక్కినేని సమకాలీకులు అన్న విషయం తెలిసిందే . అయితే ఇందులో ఎన్టీఆర్ గొప్పతనమే తప్ప అక్కినేని గురించి గొప్పగా ఏమి ఉండదు కాబట్టి ఆ పాత్ర పోషించి తాతయ్య ఇమేజ్ ని ఎందుకు తగ్గించడం అని అనుకుంటున్నాడట సుమంత్ .

తాతయ్య అంటే సుమంత్ కు ఎనలేని గౌరవం అంతేకాదు కొడుకుల కంటే ఎక్కువగా సుమంత్ అంటేనే ఇష్టం తాతయ్య కు అందుకే ఆ తాతయ్య పాత్ర ని పోషించి తక్కువ చేయడం ఎందుకు అని భావిస్తున్నట్లు తెలుస్తోంది . అయితే దర్శకులు క్రిష్ మాత్రం అక్కినేని పాత్రలో సుమంత్ అయితేనే బాగుంటుందని మళ్ళీ ఓ ప్రయత్నం చేయాలనీ భావిస్తున్నాడు . ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేసుకుంది ఎన్టీఆర్ బయోపిక్ . ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటిస్తుండగా బసవతారకం పాత్రలో బాలీవుడ్ హాట్ భామ విద్యాబాలన్ నటిస్తోంది . క్రిష్ – బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి పెద్ద హిట్ కావడంతో ఈ బయోపిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి .

English Title: sumanth not intrested on ntr biopic