సందీప్ కిష‌న్ – ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ మూవీ స్టార్ట్‌!

సందీప్ కిష‌న్ - ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ మూవీ స్టార్ట్‌!
సందీప్ కిష‌న్ – ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ మూవీ స్టార్ట్‌!

విభిన్న‌మైన చిత్రాల్ని ఎంచుకుంటూ వ‌రుస విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకుంటున్నారు యంగ్ హీరో సందీప్ కిష‌న్‌. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం మంగ‌ళ‌వారం వైజాగ్‌లో లాంచ‌‌నంగా ప్రారంభ‌మైంది. వేద వ్యాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని మ‌హేష్ కోనేరు నిర్మిస్తున్నారు.

పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం హీరో సందీప్ కిష‌న్‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి ప్ర‌ముఖ రైట‌ర్ కోన వెంక‌ట్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. కంక‌ట్ల సిల్క్స్ మ‌ల్లిక్ కెమెరా స్విఛాన్ చేశారు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ కోనేరు మాట్లాడుతూ ` ఈ ఏడాది సంక్రాంతికి మా ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లో వ‌చ్చిన `మాస్ట‌ర్` సూప‌ర్ డూప‌ర్ హిట్‌ను సొంతం చేసుకోవ‌డం ఆనందంగా వుంది. అదే ఉత్సాహంతో ఈ రోజు వైజాగ్‌లో కొత్త సినిమాను స్టార్ట్ చేశాం. డిఫ‌రెంట్ మూవీస్ చేయ‌డానికి ప్ర‌ధాన్య‌త‌నిచ్చే సందీప్ కిష‌న్‌తో మ‌రో డిఫ‌రెంట్ మూవీని మా బ్యాన‌ర్‌లో రూపొందించ‌బోతున్నాం. త‌న పాత్ర చాలా కొత్త‌గా వుంటుంది. ఫిబ్ర‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. వేదవ్యాస్‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నాం` అన్నారు.

ఈ చిత్రానికి చోటా కె. ప్ర‌సాద్ ఎడిటింగ్, యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రంలో న‌టించ‌బోయే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల్ని తెలియ‌జేస్తాం` అని మ‌హేష్ కోనేరు తెలిపారు.