సందీప్ కిష‌న్ మ‌రో సినిమా డేట్ ఇచ్చాడు!

సందీప్ కిష‌న్ మ‌రో సినిమా డేట్ ఇచ్చాడు!
సందీప్ కిష‌న్ మ‌రో సినిమా డేట్ ఇచ్చాడు!

ఇటీవ‌ల `ఏ1 ఎక్స్‌ప్రెస్‌` అంటూ స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్ష‌కుల్ని అల‌రించిన సందీప్ కిష‌న్ ఈ సారి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `గ‌ల్లీరౌడీ`. జి. నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌కుడు. నేహాశెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ని తాజాగా వీవీవినాయ‌క్‌, నందినిరెడ్డి రిలీజ్ చేశారు. ఈ మూవీ మే21న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ సంద‌ర్భంగా వీవీ వినాయ‌క్ మాట్లాడుతూ `కామెడీ సినిమాలు తీయ‌డంలో నాగేశ్వ‌ర‌రెడ్డిది ప్ర‌త్యేక శైలి. మ్యూజిక్ సెన్స్ కూడా ఆయ‌న‌కు ఎక్కువే. సందీప్ మంచి క‌థ‌లు ఎంపిక చేసుకుంటున్నాడు. ఈ చిత్రం విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను. సందీప్ చోటాకె కాదు నాకూ అల్లుడి లాంటి వాడే` అన్నారు.
సందీప్ కిష‌న్ మాట్లాడుతూ `ఏ1 ఎక్స్‌ప్రెస్‌` త‌రువాత ఓ వినోదాత్మ‌క క‌థ చేయాల‌ని చేశా. రౌడీయిజాన్ని ఓ వార‌స‌త్వ ఆస్తిగా స్వీక‌రించాల్సి వ‌స్తే ఎలా వుంటుంది? అన్న‌దే ఈ చిత్ర క‌థాంశం. వెంక‌టేశ్వ‌ర‌రావు అను పిరికి హెడ్ కానిస్టేబుల్ పాత్ర‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్ క‌నిపిస్తారు` అని తెలిపారు.

`నేను ఓ ప్రేక్ష‌కుడ ఇలా ఆలోచించే క‌థ‌లు ఎంపిక చేసుకుంటా. ఇదీ అలాంటి క‌థే` అన్నారు నాగేశ్వ‌ర‌రెడ్డి. `ఈ క‌రోనా కాలంలో చ‌క్క‌టి హాయి గొలిపే న‌వ్వులని అందించే సినిమా ఇద‌ని రాజేంద్ర ప్ర‌సాద్ తెలిపారు.  `ఇది `గీతాంజ‌లి` కంటే పెద్ద హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌క‌ముంద‌ని నిర్మాత తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో కోన వెంక‌ట్‌, నేహా, చోటా కె ప్ర‌సాద్‌, సాయి కార్తీక్ త‌దిత‌రులు పాల్గొన్నారు.