సినిమా బాగోదనే ఉద్దేశం ప్రేక్షకులకు ఎందుకు కలిగింది? : సందీప్ కిషన్


sundeep kishan surprised with bad talk of tenali ramakrishna
Sundeep Kishan

యువ హీరో సందీప్ కిషన్ వరస ప్లాపులతో అల్లాడుతున్నాడు. హీరోగా లాస్ట్ హిట్ ఎప్పుడు కొట్టాడో కూడా ఈ హీరోకి గుర్తు ఉండిఉండకపోవచ్చు. ఈ పరిస్థితికి కారణమెవరైనా కానీ ప్రస్తుతం సందీప్ హిట్ కోసం పరితపిస్తున్నాడన్నది మాత్రం వాస్తవం. లాస్ట్ చిత్రం నిను వీడను నీడను నేనే ఒక మోస్తరు కలెక్షన్స్ తో కొంత ఊరట కలిగించినా పూర్తి సంతృప్తినిచ్చే సినిమా మాత్రం కాదు. దాంతో ఇటీవలే విడుదలైన తెనాలి రామకృష్ణ బిఎ బిఎల్ సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. కామెడీ జోనర్ లో తెరకెక్కిన సినిమా కావడంతో సినిమాకు మంచి రీచ్ ఉంటుందని భావించాడు. పైగా ఇది మాస్ కామెడీ కావడంతో బి,సి సెంటర్లలో తిరుగుండదని అనుకున్నాడు. తీరా సినిమా విడుదలయ్యాక తన ఆశలన్నీ అడియాసలే అని తేలింది. తనకు ఈ సినిమా కూడా హిట్ ఇవ్వట్లేదని తెలుసుకున్నాడు. చాలా ఆవేదనతో నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడాడు సందీప్ కిషన్.

సినిమా చూసిన వారు బాగుంది అంటున్నారని అయితే కలెక్షన్లు మాత్రం ఎందుకు రావట్లేదో తనకు అర్ధం కావట్లేదని అన్నాడు. నేను ఏఎంబి సినిమాస్ లో, మరికొన్ని మల్టీప్లెక్స్ లలో సినిమాలు చూసాను. ఆడియన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దాదాపు 70 శాతం ఆక్యుపెన్సీ కూడా ఉంది. అయినా సినిమా ఎందుకు ఇలా అవుతోందో అర్ధం కావట్లేదని అన్నాడు. సినిమా విడుదలైన తొలి రోజే దారుణమైన టాక్ స్ప్రెడ్ అయింది. రివ్యూలు కూడా ఘోరంగా వచ్చాయి. ఈ విషయాన్ని సందీప్ కిషన్ ఇండెరెక్ట్ గా పాయింట్ ఔట్ చేస్తూ చాలా మంది బాలేదన్న ఉద్దేశంతో సినిమాకు వెళ్లామని, కానీ సినిమా మాకు నచ్చిందని చాలా మంది తనతో అన్నారని అంటున్నాడు సందీప్.

అసలు సినిమా ఎందుకు బాగోదని ముందుగా ప్రేక్షకులు అనుకుంటున్నారో తనకు మాత్రం అర్ధం కావడంలేదని వాపోయాడు సందీప్. తన గత చిత్రం నిను వీడను నీడను నేనే చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ స్థాయిలో కూడా రావట్లేదని నిరాశను వ్యక్తం చేసాడు. మంచి సెటప్, కామెడీ జోనర్ సినిమా ఇలా అన్నీ కుదిరినా సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఎందుకు పెర్ఫార్మ్ చేయట్లేదోనని ఆవేదన వ్యక్తం చేసాడు. సినిమా చూస్తే అందరూ కచ్చితంగా నవ్వుకుంటారని ఇదొక మంచి ఎంటర్టైనర్ అని ప్రేక్షకులను ఉద్దేశించి చెప్పాడు సందీప్ కిషన్.

మొదటి రోజు నుండే టాక్ బ్యాడ్ గా రావడంతో కలెక్షన్స్ ఘోరంగా ఉన్నాయి తెనాలి రామకృష్ణ సినిమా విషయంలో. తొలి వీకెండ్ లోనే సరిగా పెర్ఫార్మ్ చేయని ఈ చిత్రం ఇక వీక్ డేస్ లో బాగా డల్ గా ఉంది. ఈ నేపథ్యంలోనే సందీప్ పై విధంగా వ్యాఖ్యలు చేసాడనుకోవాలి. ఇక రిలీజ్ అయిన మొదటి రోజే ఈ చిత్రానికి మొదట సక్సెస్ మీట్ పెట్టారు. అందులో దర్శకుడు నాగేశ్వర రెడ్డి రివ్యూయర్లను ఏకేసాడు. తమ సినిమా సూపర్ హిట్ అని, రివ్యూ రాసే వాళ్ళను చెడామడా తిట్టిపోశాడు.