సందీప్ కిషన్‌తో వీఐ ఆనంద్ సూపర్ నేచురల్ ఫాంటసీ!

సందీప్ కిషన్‌తో వీఐ ఆనంద్ సూపర్ నేచురల్ ఫాంటసీ!
సందీప్ కిషన్‌తో వీఐ ఆనంద్ సూపర్ నేచురల్ ఫాంటసీ!

తొలి క‌లిసి వ‌ర్క్ చేసిన కాంబినేష‌న్ సూప‌ర్ హిట్‌ని సొంతం చేసుకుని కొంత విరామం త‌రువాత మ‌ళ్లీ క‌లిస్తే ఆ కాంబినేష‌న్‌లో రానున్న సినిమాపై అంచ‌నాలు నెల‌కొంటాయి. ఇప్పుడు అదే త‌ర‌హా అంచ‌నాలు సందీప్ కిష‌న్‌, వీఐ ఆనంద్ క‌ల‌యిక‌లో రాబోతున్న సినిమాపై ఏర్ప‌డ్డాయి. వివ‌రాల్లోకి వెళితే… సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ డైరెక్ట్ చేసిన చిత్రం `టైగ‌ర్‌`.

వీరిద్ద‌రి తొలి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఈ మూవీ సూప‌ర్ హిట్ గా నిలిచింది. దాదాపు ఆరేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ వీరిద్ద‌రూ క‌లిసి ఓ సినిమా చేస్తున్నారు. ఇది సందీప్ కిష‌న్ న‌టిస్తున్న 28వ చిత్రం. హాస్య మూవీస్ బ్యాన‌ర్‌పై రాజేష్ దండ ఈ మూవీని నిర్మించ‌నున్నారు. ఈ రోజు సుందీప్ కిషన్ పుట్టినరోజు కావ‌డంతో ఈ చిత్రాన్ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

సందీప్ కిష‌న్ ప్రీ లుక్‌తో విడుద‌ల చేసిన ఈ మూవీ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది.  సూప‌ర్ నేచుర‌ల్ ఫాంట‌సీగా ఈ మూవీని ద‌ర్శ‌కుడు వీఐ ఆనంద్ తెర‌కెక్కించ‌బోతున్నారు. ఫొటోలో సందీప్ కిషన్ ఒక వస్తువు లేదా వ్యక్తి కోసం వెతుకుతున్నప్పుడు ఒక రహస్య ప్రదేశంలో నిలబడి ఉన్న‌ట్టుగా క‌నిపిస్తున్నాడు. SK28 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో రూపొంద‌నున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది.