ఆర్ ఎక్స్ 100 రీమేక్ బాలీవుడ్ లో


Suniel shetty son Ahan shetty debut in hindi with RX 100

టాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన చిత్రం ఆర్ ఎక్స్ 100 . బాలీవుడ్ భామ పాయల్ రాజ్ పుత్కార్తికేయ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందు అంతగా అంచనాలు లేవు కానీ ఎప్పుడైతే ట్రైలర్ విడుదల అయ్యిందో అప్పటి నుండి ఆర్ ఎక్స్ 100 చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి . కట్ చేస్తే సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది . ఇంకేముంది ఆర్ ఎక్స్ 100 చిత్రాన్ని పలు బాషలలో రీమేక్ చేయడానికి పలువురు పోటీ పడ్డారు . ఇక ఈ బోల్డ్ చిత్రాన్ని చూసిన బాలీవుడ్ వాళ్ళు సైతం రీమేక్ చేయడానికి పోటీ పడి హక్కులు సాధించుకున్నారు .

బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి ని హీరోగా పరిచయం చేయనున్నాడు బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా . పలు హిట్ చిత్రాలను నిర్మించిన సాజిద్ ఇప్పుడు సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి ని హీరోగా పరిచయం చేస్తూ ఆర్ ఎక్స్ 100 చిత్రాన్ని రీమేక్ చేయనున్నాడు . అసలే బోల్డ్ మూవీ అందునా బాలీవుడ్ లో రీమేక్ అంటే ఇక ఆ సినిమా ఎలా ఉంటుందో కొత్తగా చెప్పడానికి ఏముంది , యువతకు కావాల్సినంత మసాలా అన్నమాట .

English Title: Suniel shetty son Ahan shetty debut in hindi with RX 100