రూమ‌ర్స్ పెర‌క్క‌ముందే క్లారిటీ ఇచ్చిన సునీల్‌!రూమ‌ర్స్ పెర‌క్క‌ముందే క్లారిటీ ఇచ్చిన సునీల్‌!
రూమ‌ర్స్ పెర‌క్క‌ముందే క్లారిటీ ఇచ్చిన సునీల్‌!

సునీల్ ఆరోగ్య ప‌రిస్థితి బాగా లేద‌ని ఈ రోజు ఉద‌యం నుంచి ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై తాజాగా సునీల్ వివ‌ర‌ణ ఇచ్చారు. గ‌త కొన్ని రోజులుగా తీవ్ర‌మైన జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న బుధ‌వారం రాత్రి గ‌చ్చిబౌలిలోని ఆసుప‌త్రిలో చేరారు. దీంతో ఆయ‌న‌కు నఏదో అయిపోయింద‌ని, ర‌క‌ర‌కాల ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. త‌నపై రూమ‌ర్స్ మ‌రింతగా ముద‌ర‌క‌ముందే రంగంలోకి దిగిన సునీల్ క్లారిటీ ఇచ్చారు.

త‌ను క్షేమంగా వున్నాన‌ని, సైనస్ ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు ఆసుప‌త్రిలో చేరాన‌ని, అంత‌కు మించి త‌న‌కు ఏమీ కాలేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. దీంతో ఆయ‌న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సునీల్ `అర‌వింద స‌మేత‌` కొత్త ఇన్నింగ్స్‌ని మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ న‌టించిన `డిస్కోరాజా` చిత్రంలోనూ ఓ కీల‌క పాత్ర‌లో సునీల్ న‌టించారు. ఈ సినిమా ఈ 24న రిలీజ్ కాబోతోంది. అనారోగ్యం కార‌ణంగా ఈ చిత్ర ప్ర‌మోష‌న్‌కు సునీల్ దూరంగా వున్నార‌ని తెలిసింది.