త్రివిక్రమ్ అతడికి మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాడు


Sunil gets another chance by trivikram

త్రివిక్రమ్సునీల్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే . పైగా ఈ ఇద్దరు కూడా రూమ్ మేట్స్ కష్టాల్లో ఉన్నప్పుడు , సినిమాల్లో ఛాన్స్ ల కోసం తిరుగుతున్నప్పుడు . అయితే త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ కాగా సునీల్ కూడా స్టార్ స్టేటస్ పొందాడు కట్ చేస్తే సునీల్ కు వరుస ప్లాప్ లతో కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది దాంతో హీరో వేషాలు పక్కన పెట్టి మళ్ళీ కమెడియన్ గా వేషాలు వేయడం మొదలు పెట్టాడు .

అయితే కామెడీ వేషాలు వేసిన చిత్రాలు కూడా ప్లాప్ జాబితాలో చేరడంతో కమెడియన్ గా కూడా బిజీ కాలేకపోతున్నాడు సునీల్ దాంతో మళ్ళీ స్నేహితుడ్ని ఆదుకోవడానికి తాజాగా అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాలో మరోసారి అవకాశం ఇస్తున్నాడట త్రివిక్రమ్ . మరి ఈ సినిమాతోనైనా సునీల్ కెరీర్ గాడిలో పడుతుందా ? చూడాలి . ఎందుకంటే అరవింద సమేత చిత్రంలో ఛాన్స్ ఇచ్చాడు కానీ అది వర్కౌట్ కాలేదు మరి .

English Title: Sunil gets another chance by trivikram