అమెరికాలో సునీల్ చక్కెర్లు?


Sunil and KA Paul
Sunil and KA Paul

ప్ర‌ముఖ క్రైస్థవ మతబోథకుడు  కె.ఏ పాల్ బ‌యోపిక్ తీయ‌బోతున్నారు..  అని చాలా కాలంగా ఇండస్ట్రీలో వార్త‌లు వ‌స్తున్నాయి. కేఏ పాల్‌గా సునీల్ న‌టించ‌బోతున్నాడ‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. ఈ విష‌య‌మై సునీల్ ఇంత‌వ‌ర‌కు నోరు విప్ప‌లేదు. ఐతే, ఈ సినిమా కోస‌మే సునీల్ తాజాగా అమెరికా వెళ్లాడ‌ట‌.

పాల్‌కి త‌గ్గ మేక‌ప్‌ని క్రియేట్ చేసుకునేందుకు అమెరికా వెళ్లిన‌ట్లు టాక్‌. బాడీ పరంగా కేర్ తీసుకొని కొంచెం స్లిమ్ కూడా అవుతున్నాడట. దీనికోసం ప్రత్యేక ట్రైనర్ నేతృత్వంలో డైలీ ఎక్సర్ సైజ్ చేస్తున్నట్లు తెలిసింది.  అలాగే ఈ చిత్రంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాత్రకూడా వుంటుందట

ట్రంప్  పోలికలు వుండే ఓ ఆర్టిస్ట్ ని కూడా సెలెక్ట్ చేసారు అని వినికిడిఈ సినిమాలో నార్త్ కొరియా అధ్యక్షుడు, కిమ్, ఏంజలీనా జోలీ పోలికలుండే ఆర్టిస్టులు కూడా నటిస్తున్నట్లు ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది!!