భ‌ర‌ద్వాజ్ సినీ క్రియేష‌న్స్ `హ‌నీట్రాప్` మొద‌లైంది


భ‌ర‌ద్వాజ్ సినీ క్రియేష‌న్స్ `హ‌నీట్రాప్` మొద‌లైంది
భ‌ర‌ద్వాజ్ సినీ క్రియేష‌న్స్ `హ‌నీట్రాప్` మొద‌లైంది

సొంత ఊరు, గంగ‌పుత్రులు, గ‌ల్ఫ్ వంటి సామాజిక చిత్రాల‌ను.. రొమాంటిక్  క్రైమ్ క‌థ‌, క్రిమిన‌ల్ ప్రేమ‌క‌థ వంటి యూత్‌ఫుల్ చిత్రాల‌ని అందించిన పి. సునీల్‌కుమార్‌రెడ్డి తెర‌కెక్కిస్తున్న రొమాంటిక్ థ్రిల్ల‌ర్  `హ‌నీట్రాప్‌`. భ‌ర‌ద్వాజ్ సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వి.వి.వామ‌న‌రావు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తూనే క‌థా, స్క్రీర్‌ప్లే అందిస్తున్నారు.

సాయిరుషి, తేజు అనుపోజు హీరో హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. శివ కార్తీక్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ` ప్ర‌ముఖ రంగ‌స్థ‌ల నాట‌క ర‌చ‌యిత‌, మిత్రుడు వామ‌న రావు మంచి క‌థ వినిపించారు. నేను చేసిన జోన‌ర్స్‌కి ద‌గ్గ‌ర‌గా ఉంఊ క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో ఆడియ‌న్స్‌ని అల‌రించే స‌బ్జెక్ట్ కావ‌డంతో ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాను. ఈ మూవీ ద్వ‌రా స‌త్యానంద్ గారి శిష్యుడు సాయి రుషి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. నిర్మాత వామ‌న‌రావు కూడా ఓ పాత్ర‌లో న‌టిస్తున్నారు. న‌వంబ‌ర్ నుంచి ఫ‌స్ట్ షెడ్యూల్ ప్రారంభించి హైద‌రాబాద్ లో షూటింగ్ చేయ‌నున్నాం.  డిసెంబ‌ర్‌లో నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం ` అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ` య‌నివ‌ర్స‌ల్ స‌బ్జెక్ట్ కావ‌డంతో టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సునీల్‌కుమార్ గారికి క‌థ వినిపించాను. త‌ప్ప‌కుండా ఆయ‌న ఈ క‌థ‌కి న్యాయం చేయ‌గ‌ల‌ర‌ని ఆశిస్తున్నాను. మంచి టీమ్ కుదిరింది. త‌ప్ప‌కుండా అంద‌రిని ఆలోచింప‌జేస్తుంద‌ని భావిస్తున్నాను`అన్నారు.