`ఎఫ్‌3` కోసం అనిల్ రావిపూడి న్యూ ప్లాన్‌!


`ఎఫ్‌3` కోసం అనిల్ రావిపూడి న్యూ ప్లాన్‌!
`ఎఫ్‌3` కోసం అనిల్ రావిపూడి న్యూ ప్లాన్‌!

ఫ‌న్ అండ్ ఫ్ర‌‌స్ట్రేష‌న్ అంటూ వెంకీ ఆస‌న్‌తో అనిల్ రావి పూడి ఓ రేంజ్‌లో ర‌చ్చ చేసిన విష‌యం తెలిసిందే. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌, త‌మ‌న్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్‌లుగా `ఎఫ్‌2` పేరుతో రూపొందిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా వంద కోట్ల క్ల‌బ్‌లో చేరి ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌య‌ప‌రిచింది.

ఈ చిత్రానికి సీక్వెల్‌గా మోర్ ఫ‌న్ మోర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ తో `ఎఫ్ 3`ని రూపొందించాల‌ని అనిల్ రావిపూడి గ‌త కొన్ని నెల‌లుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో `ఎఫ్‌3` స్క్రిప్ట్‌ని పూర్తి చేసిన అనిల్ ఎలాగైనా ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే వెంక‌టేష్ ప్ర‌స్తుతం `నార‌ప్ప‌` మూవీలో న‌టిస్తున్నారు. ఇది పూర్త‌యితే గానీ `ఎఫ్‌3`కి డేట్స్ ఇవ్వ‌రు. ఇక వ‌రుణ్ తేజ్ కొత్త ద‌ర్శ‌కుడితో బాక్సింగ్ నేప‌థ్యంలో సినిమా చేస్తున్నారు.

ఇది పూర్తయితే గానీ వ‌రుణ్ ఫ్రీ కాడు. దీంతో `ఎఫ్‌3` మ‌రింత ఆల‌స్యం కానుంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ కోసం సునీల్‌ని `ఎఫ్‌3` కోసం అనిల్ రావిపూడి ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టించ‌నున్న ఈ మూవీలో సునీల్ కీ రోల్‌ని పోషించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.  `అర‌వింద స‌మేత‌` చిత్రంతో మ‌ళ్లీ క్యారెక్ట‌ర్ ఆర్టీస్ట్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్ `ఎఫ్‌3`లో ఓ రేంజ్‌లో మోర్ ఫ‌న్ ని పండించ‌బోతున్నాడ‌ట‌. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని త్వ‌ర‌లోనే ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలిసింది.