సునీత పిల్ల‌లు ఆమెపై ఆగ్ర‌హంతో వున్నారా?

సునీత పిల్ల‌లు ఆమెపై ఆగ్ర‌హంతో వున్నారా?
సునీత పిల్ల‌లు ఆమెపై ఆగ్ర‌హంతో వున్నారా?

పాపుల‌ర్ సింగ‌ర్ సునీత ఇటీవ‌ల రామ్ వీర‌ప‌నేని రెండో వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. గ‌త కొంత కాలంగా భ‌ర్త కిర‌ణ్‌తో విడిపోయిన సునీత త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి వుంటోంది. అయితే ఇటీవ‌ల రామ్ వీర‌ప‌నేని రెండో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం జ‌న‌వ‌రిలో జ‌రిగింది. ఇదిలా వుంటే సింగ‌ఱ్ సునీత‌పై ఆమె పిల్ల‌లు ఆగ్ర‌హంతో వున్నార‌ట‌.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా సింగ‌ర్ సునీత వెల్ల‌డించింది. వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా సుమ…సునీత‌, రామ్‌ల‌తో ఓ ప్ర‌త్యేక చిట్ చాట్‌ని నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా సునీత ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది. `నాకు రామ్ చాలా రోజులుగా తెలుసు. త‌ను ఎన్ని సార్లు ఫోన్ చేసినా నేను రిసీవ్ చేసుకునేదాన్ని కాదు. లాక్‌డౌన్ స‌మ‌యంలో వృత్తి ప‌ర‌మైన విష‌యమై రామ్ నాకు ఓ రోప‌జు ఫోన్ చేశారు. `ఇంకేంటి.. ఇలాగే వుంటావా?… పెళ్లి గురించి ఏమైనా ప్లాన్స్ వున్నాయా? అని రామ్‌ని అడిగా. దానికి ఆయ‌న నిన్ను పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్నాను. గ‌త ఏడేళ్లుగా నీకు చెప్పాల‌ని ప్ర‌య‌త్నించాను` అని స‌మాధానం చెప్పాడు.

ఈ విష‌యం ఇంట్లో మా వాళ్ల‌కి చెప్పాను. పిల్ల‌ల‌కూ వివ‌రించాను. అంతా ఓకే అన్నారు. ఇదిలా వుంటే రామ్ నా గురించి వాళ్లింట్లో వాళ్ల‌కి చెప్పేశాడు. దాంతో వాళ్లు మా అమ్మా నాన్న‌ల‌తో మాట్లాడాల‌ని ఇంటికి వ‌చ్చారు. ఆ స‌మ‌యంలోనే నాకు తాంబూలం ఇచ్చారు. దానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. అంతే కాకుండా మాకు నిశ్చితార్థం జ‌రిగిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌లు చూసి నా పిల్ల‌లు కొంత అస‌హ‌నానికి గుర‌య్యారు. నీ ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందంట క‌దా మాకు మాట‌మాత్ర‌మైనా చెప్ప‌లేదు. మంచి డ్రెస్సులు వేసుకునే వారం క‌దా` అన్నారు. నాకు ఏమాత్రం తెలియదురా.. మాట్లాడ‌దాం అని వ‌చ్చి తాంబూలం ఇచ్చేశారు` అని చెప్ప‌గానే న‌న్ను అర్థం చేసుకున్నార‌ని సింగర్ సునీత అస‌లు విష‌యం చెప్పేసింది.