వివాదంలో సన్నీ లియోన్ బయోపిక్


sunnyleone biopic in controversyమాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ బయోపిక్ వెబ్ సిరీస్ వివాదంలో చిక్కుకుంది , సన్నీ లియోన్ బయోపిక్ అని పేరు పెట్టుకోకుండా కరణ్ జీత్ కౌర్ అని పెట్టడం తప్పని ఎందుకంటే సన్నీ లియోన్ ఎప్పుడు కూడా సిక్కు మతగురువుల పాఠాలు వినలేదని అలాగే సిక్కు మత సిద్ధాంతాలను ఆచారాలను పట్టించుకోలేదని అందువల్ల ఆమె జీవిత కథగా తెరకెక్కిన బయోపిక్ నుండి కౌర్ అనే పదం తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు . సన్నీ లియోన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రం ” కరణ్ జీత్ కౌర్ -ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్ ” . కాగా ఈ వెబ్ సిరీస్ ని రేపటి నుండి జీ 5 టెలికాస్ట్ చేయనుంది .

సిక్కు మతానికి చెందిన వాళ్ళు మాత్రమే కాకుండా భారతీయ హిందూ మూలలను తక్కువ చేసి చూపించారని ఆరోపిస్తూ ఓ మరాఠా సంస్థ కూడా ఆందోళన చేపడుతోంది . అయితే అటు సిక్కు మతస్థులు , ఇటు మరాఠా సంస్థ వాళ్ళు ఆందోళన చేస్తున్నప్పటికీ సన్నీ లియోన్ కానీ బయోపిక్ రూపొందించిన వాళ్ళు కానీ ఆ వివాదాలను లెక్క చేయడమే లేదు . ఇక సన్నీ లియోన్ అయితే నా బయోపిక్ ని నా కళ్ళతో చూడండి అంటూ ట్వీట్ చేసింది తప్ప వివాదాన్ని గురించి పల్లెత్తు మాట అనలేదు .

English Title: sunny leone biopic in controversy