హిందీ అర్జున్ రెడ్డి కి సూపర్ హిట్ టాక్


kabir singh
kabir singh

టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే . సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన కబీర్ సింగ్ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటించగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది . ఇక ఈ సినిమా ఈరోజు భారీ ఎత్తున విడుదల అయ్యింది . అయితే ఓవర్ సీస్ లో మాత్రం ముందుగానే షోలు పడతాయి కాబట్టి ఆ షోల టాక్ ప్రకారం కబీర్ సింగ్ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది .

తెలుగులో కల్ట్ మూవీ గా పేరుతెచ్చుకున్న అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండ నటన హైలెట్ కాగా కబీర్ సింగ్ లో కూడా షాహిద్ కపూర్ నటన హైలెట్ గా నిలిచింది . కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ షాహిద్ కపూర్ ఇచ్చినట్లుగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రేక్షకులు . కబీర్ సింగ్ కు హిట్ టాక్ రావడంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది .