బన్నీసాంగ్ లిరిక్స్ టైటిల్ తో మెగా అల్లుడుబన్నీసాంగ్ లిరిక్స్ టైటిల్ తో మెగా అల్లుడు
బన్నీసాంగ్ లిరిక్స్ టైటిల్ తో మెగా అల్లుడు

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, గురూజీ త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా “సన్నాఫ్ సత్యమూర్తి.” ఈ సినిమాలో క్లైమాక్స్ ముందు “సూపర్ మచ్చి” అనే సాంగ్ వస్తుంది. దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ఆ పాట సూపర్ హిట్. ఇప్పుడు ఆ పాట లో ఉండే హుక్ నోట్ లిరిక్స్ అయిన “సూపర్ మచ్చి” అనే టైటిల్ ను మెగాస్టార్ చిరంజీవి గారి స్వయానా అల్లుడు అయిన కళ్యాణ్ దేవ్ సినిమాకు టైటిల్ గా ఫిక్స్ చేసారు.

ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు రిజ్వాన్,ఖుషి నిర్మాతలు. పులి వాసు ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నారు. రచితా రామ్ కథానాయికగా నటిస్తోంది. గోల్డెన్ పీరియడ్ లో కొనసాగుతున్న తమన్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. ఇక ఈ సినిమా మంచి ప్రేమకథతో కూడిన ఫ్యామిలీ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఈ సినిమాను లేట్ సమ్మర్ లో రిలీజ్ చేసే అవకాశాలు  ఉన్నాయి. రాజేంద్రప్రసాద్ & సీనియర్ నరేష్ గార్ల జోడీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చిత్ర టీం తెలియచేస్తున్నారు. ఇప్పటికే కళ్యాణ్ దేవ్ నటించిన విజేత సినిమా గతంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతగా విజయం సాధించకపోయినా, కళ్యాణ్ దేవ్ యాక్టింగ్, ఈజ్ కు మంచిపేరు వచ్చింది. ఇక “సూపర్ మచ్చి” సినిమా విజయం పట్ల యూనిట్ అందరూ ధీమాగా ఉన్నారు.