నైజాం లో అదరగొట్టిన విజయ్ దేవరకొండ


Super offer for Vijay Devarakonda's Dear Comrade in Nizam

టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ తాజాగా డియర్ కామ్రేడ్ తో నైజాం లో అదరగొట్టే బిజినెస్ చేసాడు . పెళ్లిచూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం , టాక్సీవాలా చిత్రాలతో సంచలనం సృష్టించిన ఈ హీరో రేంజ్ అమాంతం పెరిగింది దాంతో విజయ్ దేవరకొండ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది .

 

తాజాగా ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్ . ఈ సినిమా తెలంగాణ హక్కులను 7కోట్ల 60 లక్షలకు దక్కించుకున్నారు ఏషియన్ సినిమాస్ . విజయ్ దేవరకొండ చిత్రాల్లోనే అత్యధిక రేటు పలికింది డియర్ కామ్రేడ్ .మొత్తానికి ఒక్కో సినిమాతో తన రేంజ్ ని పెంచుకుంటూ పోతున్నాడు విజయ్ దేవరకొండ . ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి . రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మే 31 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: Super offer for Vijay Devarakonda’s Dear Comrade in Nizam