జెర్సీ ట్రైలర్ తో అంచనాలు పెంచిన నాని


గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన చిత్రం జెర్సీ . నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ కు స్పందన అద్భుతంగా ఉండటంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది . ఈ ట్రైలర్ తో జెర్సీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి . జెర్సీ చిత్రం ఈనెల 19 న విడుదల అవుతున్న విషయం తెలిసిందే . నాని మిడిల్ ఏజ్ లో క్రికెట్ ప్లేయర్ గా నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి .

నాని సరసన శ్రద్దా శ్రీనాథ్ నటిస్తోంది . ఇక ట్రైలర్ లో క్రికెట్ తో పాటుగా యూత్ కి కిక్ ఇచ్చే కిస్ సీన్లు కూడా యాడ్ చేసారు . ఇంకేముంది యువతకు పిచ్చ పిచ్చగా నచ్చుతోంది ట్రైలర్ . ఏప్రిల్ 15 న జెర్సీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ ఎత్తున చేస్తున్నారు అలాగే ఏప్రిల్ 19 న సినిమాని రిలీజ్ చేయనున్నారు . మొత్తానికి నాని జెర్సీ తో హిట్ కొట్టేలాగే ఉన్నాడు .