సూపర్ 30 ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్


బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించినసూపర్ 30 ” చిత్ర ట్రైలర్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ కాగా ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది . అసలు సూపర్ 30 ఫస్ట్ లుక్ కే విపరీతమైన స్పందన వచ్చింది దాంతో ట్రైలర్ పై అంచనాలు పెరిగాయి . అంచనాలకు తగ్గట్లుగా ట్రైలర్ ఉండటంతో సూపర్ 30 కి సూపర్ రెస్పాన్స్ అదిరింది . ఆనంద్ కుమార్ పాత్రలో హృతిక్ రోషన్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు

ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రాన్ని జూలై 12 భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . వికాస్ భల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాన్ని సాజిద్ నడియాడ్ వాలా నిర్మించాడు . బయోపిక్ లు సంచలన విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో హృతిక్ రోషన్సూపర్ 30 ” పై భారీ అంచనాలు నెలకొన్నాయి . అంచనాలకు తగ్గట్లుగా ట్రైలర్ ఫిదా చేస్తుండటంతో హృతిక్ రోషన్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు