నాగార్జున బిగ్ బాస్ గా మెప్పించడం ఖాయం


Big Boss 3 Promo
Big Boss 3 

తెలుగులో బిగ్ బాస్ 3 ప్రారంభం కానుంది , అయితే ఈసారి మాత్రం హోస్ట్ మారాడు కింగ్ నాగార్జున బిగ్ బాస్ 3 కి నేతృత్వం వహించనున్నాడు . ఇంతముకుందు బిగ్ బాస్ 1 కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా బిగ్ బాస్ 2 కు నాని వ్యాఖ్యాతగా వ్యవహరించాడు . అయితే ఎన్టీఆర్ కు ప్రశంసలు దక్కగా నాని పై మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వచ్చి పడ్డాయి . ఇక ఇప్పుడు మూడో సీజన్ కు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవరిస్తుండటంతో ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని అంటున్నారు యునానిమస్ గా .

ఎందుకంటే ఇంతకుముందు మీలో ఎవరు కోటీశ్వరుడు అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి శభాష్ అనిపించాడు . కట్ చేస్తే ఇప్పుడు బిగ్ బాస్ 3 ని కూడా తనదైన స్టైల్ లో అలరించడం ఖాయమని అంటున్నారు . ఇప్పటికే నాగ్ టీజర్ ని రిలేస్ చేసారు దానికి మంచి స్పందన వస్తోంది దాంతో బిగ్ బాస్ 3 హిట్ అయినట్లే అని అంటున్నారు .