వాల్మీకి లో వరుణ్ గెటప్ కు రెస్పాన్స్ బాగుంది


Super response for Varun getup in Valmiki
Varun getup in Valmiki

మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం ” వాల్మీకి ” . హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళ జిగర్తాండా చిత్రానికి రీమేక్ అన్న విషయం తెలిసిందే . తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తాండ ని తెలుగులో వాల్మీకి గా రూపొందిస్తున్నాడు హరీష్ శంకర్ . గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తీసిన హరీష్ కు దువ్వాడ జగన్నాథం ఆశించిన విజయాన్ని ఇవ్వలేకపోయింది . దాంతో వాల్మీకి పై ఆశలు పెట్టుకున్నాడు .

ఇక ఈరోజు కొద్దిసేపటి క్రితం వాల్మీకి చిత్రంలోని వరుణ్ గెటప్ ని రివీల్ చేసారు . వరుణ్ గెటప్ కి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు . అందుకే క్షణాల్లోనే వాల్మీకి ప్రీ టీజర్ కు రెస్పాన్స్ బాగా వచ్చింది . ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6 న వినాయకచవితి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ కొట్టిన వరుణ్ తేజ్ కు వాల్మీకి ఎలాంటి విజయాన్ని ఇస్తుందో తెలియాలంటే సెప్టెంబర్ వరకు ఎదురు చూడాల్సిందే .