నిజాలు మాత్ర‌మే రాయండీ: ర‌జ‌నీ

నిజాలు మాత్ర‌మే రాయండీ: ర‌జ‌నీ
నిజాలు మాత్ర‌మే రాయండీ: ర‌జ‌నీ

త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ మీడియాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మీడియాలో పారద‌ర్శ‌క‌త‌, నిజాయితీ లోపిస్తోందిన‌, అది స‌మాజానికి మంచిది కాద‌ని చెన్నైలో ర‌జ‌నీ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. చెన్నైలో జరిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ర‌జ‌నీ మీడియాపై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రు ఏం చేసినా ఎండ‌గ‌ట్టే మీడియా త‌ట‌స్థంగా వుంటూ వార్త‌ల్ని ప్ర‌చురించ‌డం వ‌ల్ల స‌మాజానికి న‌ష్టం క‌లుగుతోంద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

బాధ్య‌తాయుత‌మైన మీడియా రంటం త‌ట‌స్థంగా వుండ‌కుండా వాస్త‌వాల్ని వెలికితీసే ప్ర‌య‌త్నం చేయాల‌ని ఈ సంద‌ర్భంగా ర‌జ‌నీ మీడియా సంస్థ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. జ‌ర్న‌లిస్ట్ అంటే సీనియ‌ర్ పాత్రికేయులు, `తుగ్ల‌క్` ప‌త్రిక అధినేత చో రామ‌స్వామిలా వుండాల‌ని, నిజాల‌ని నిర్భ‌యంగా ప్ర‌పంచానికి చాటి చెప్పాల‌ని, అలా చేసిన‌ప్పుడే వ్య‌వ‌స్థ‌లో మార్పు, భ‌యం మొద‌ల‌వుతాయ‌ని వెల్ల‌డించారు.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో చో రామ‌స్వామి లాంటి పాత్రికేయులు కావాల‌ని, ఏది నీల్లో, ఊది పాలో జ‌ర్న‌లిస్టుల‌కు మాత్ర‌మే తెలుస‌ని, అది స‌మాజానికి కూడా తెలియ‌జేస్తే బాగుంటుంద‌ని, నిర్భ‌యంగా వార్త‌లు రాయండ‌ని, నిజాల‌ని మాత్ర‌మే చెప్పండ‌ని, స‌మాజానికి అబ‌ద్ధాల‌ని ప్రచురించొద్ద‌ని ఈ సంద‌ర్భంగా మీడియా సంస్థ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాన‌ని ర‌జ‌నీ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. దీనిపై కీల‌క మీడియా సంస్థ‌లు ఎలా స్పందిస్తాయో చూడాలి అంటున్నారు.