దుమ్ము‌రేపేస్తున్న సీటీమార్ టైటిల్ సాంగ్‌!

దుమ్ము‌రేపేస్తున్న సీటీమార్ టైటిల్ సాంగ్‌!
దుమ్ము‌రేపేస్తున్న సీటీమార్ టైటిల్ సాంగ్‌!

హీరో గోపీచంద్ న‌టిస్తున్న తాజా చిత్రం `సీట‌మార్‌`. సంప‌త్‌నంది ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. గ‌తంలో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో `గౌత‌మ్‌నందా` తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. మ‌రోసారి క‌లిసి ఈ చిత్రానికి వ‌ర్క్ చేస్తున్నారు. స్పోర్ట్స్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై శ్రీ‌నివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది.

హీరోయిన్ భూమిక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీ ప్ర‌ధానంగా మ‌హిళా క‌బ‌డ్డీ జ‌ట్ల నేప‌థ్యంలో సాగనుంది.  యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. బుధ‌వారం ఈ చిత్ర టైటిల్ సాంగ్‌ని స్టార్ హీరోయిన్ స‌మంత రిలీజ్ చేసింది. ఈ పాట ప్ర‌స్తుతం నెట్టింట దుమ్ము రేసుతోంది.

రిలీజ్ చేసిన కొన్ని గంట‌ల్లోనే మిలియ‌న్ ప్ల‌స్ వ్యూస్‌ని అధిగ‌మించ‌డం విశేషం. గ‌త కొంత కాలంగా స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ ఈ మూవీతో ఎలాగైనా సూప‌ర్ హిట్‌ని సొంతం చేసుకోవాలన్న క‌సితో వున్నారు. క‌బ‌డ్డీ గేమ్‌తో పాటు అదే స్థాయిలో ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఘ‌ట్టాలున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది.