స‌రిలేరు..` బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్‌.. అంత‌కు మించి! 

Superstar krishna comments on Mahesh film
Superstar krishna comments on Mahesh film

మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి విడుద‌లై అనూహ్య విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత పోటీ వున్నా ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు వ‌ర‌ల్డ్ వైడ్‌గా 200 కోట్ల‌కు మించి వ‌సూళ్లు సాధించి మ‌హేష్ న‌టించిన చిత్రాల్లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన చిత్రంగా సంచ‌ల‌నం సృష్టించింది.

ఈ సినిమాపై సూప‌ర్‌స్టార్ కృష్ణ చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. `స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది.  నిర్మాత‌, ద‌ర్శ‌కుడు ఈ చిత్రానికి `బ్లాక్ బ‌స్ట‌ర్‌కా బాప్` అంటూ ప్ర‌చారం చేయ‌డం బాగుంది. సినిమా అద్భుతంగా వుంది. నా ఉద్దేశంలో ఈ సినిమాకు మ‌రింత విజ‌యం వ‌రిస్తుంది. నిర్మాత ఎక్క‌డ కూడా డ‌బ్బుల విష‌యంలో రాజీప‌డ‌లేదు. ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా ద‌ర్శ‌కుడు చిత్రాన్ని చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించారు` అని ఆయ‌న పేర్కొన్నారు.

ఈ నెల 11న విడుద‌లైన ఈ చిత్రం మంచి సందేశంతో పాటు చ‌క్క‌ని వినోదాన్ని అందించి మ‌హేష్ సీరియ‌స్‌తో పాటు ఎంట‌ర్‌టైన్ కూడా చేయ‌గ‌ల‌డ‌ని ఈ సినిమాతో నిరూపించారు. సైనికుడిగా సీరియ‌స్ యాంగిల్‌ని చూపిస్తూనే మ‌రో ప‌క్క కామెడీని కూడా చేయించడంతో ఈ సినిమాపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.