పార్కింగ్ లో బండి పోతే ఇకనుండి వాళ్లదే బాధ్యత


పార్కింగ్ లో బండి పోతే  ఇకనుండి వాళ్లదే బాధ్యత
పార్కింగ్ లో బండి పోతే ఇకనుండి వాళ్లదే బాధ్యత

మహానగరాలలో ఎక్కడికైనా షికార్ కి కానీ, షాపింగ్ కానీ బయల్దేరి వెళ్ళినప్పుడు మనుషులను బాగా ఇబ్బంది పెట్టేది రెండు సమస్యలు
1. అర్జంటుగా మూత్ర విసర్జన చేయాలంటే ఎక్కడికి వెళ్లాలి.?
2. మనకి మనం షాపింగ్ చేసే చోటే మన బండికి పార్కింగ్ దొరుకుతుందా..? లేదా..?

లేకపోతే ఎక్కడో పెట్టి, ఎక్కడిదాకానో నడుచుకుంటూ వెళ్లాలి. మూత్ర విసర్జన గురించి మనం మళ్లీ మాట్లాడుకుందాం. ప్రస్తుతం వాహనాల పార్కింగ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త గురించి చెప్పుకుందాం. ఎంతోమంది సామాజిక కార్యకర్తల ఉద్యమం తర్వాత సినిమా హాల్స్ లో, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో ఉచిత పార్కింగ్ సదుపాయం వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అయినా కొన్ని చోట్ల ఇంకా వాహనాలను పార్కింగ్ చేసినందుకు డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన శుభవార్త చెప్పింది.

అది ఏమిటంటే, వాహనాల పార్కింగ్ కి డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు, ఒకవేళ వాహనం గనక చోరీకి గురయితే, దానిని నిర్వహిస్తున్న సదరు యజమాని బాధ్యత తీసుకోవలసి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో లాగా మీ సామాన్లకు మీరే బాధ్యులు – మీ వాహనాలకు మీరే బాధ్యులు అని బోర్డులు పెడితే ఇక నుండి కుదరదన్నమాట.

గతంలో కూడా 1998 ఆగస్టు 1వ తేదీ ఢిల్లీలో జరిగిన ఒక మారుతి కారు చోరీకి సంబంధించిన కేసులో బాధ్యత అది పార్కింగ్ లో ఉన్న హోటల్ వాళ్ళదే అని చెప్పి జాతీయ వినియోగదారుల ఫోరం తీర్పు ఇచ్చింది. ఆ బాధితులకు 12 శాతం వడ్డీతో 2.80 లక్షల పరిహారం, న్యాయవాదుల ఖర్చుల కింద 50 వేలు ఇవ్వాలని 2016లో తీర్పు చెప్పింది. దాన్ని సవాల్ చేస్తూ ఆ హోటల్ యాజమాన్యం సుప్రీంకోర్టుని ఆశ్రయించగా వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును సమర్పిస్తూ ప్రస్తుత వ్యాఖ్యలు చేసింది.
సరే, సుప్రీంకోర్టు చెప్పింది కదా..! అని బళ్ళు పార్కింగ్ చేసినప్పుడు, నిర్లక్ష్యంగా ఉండద్దని గౌరవనీయులైన ప్రజలకు మనవి చేస్తున్నాను.