పవన్ కళ్యాణ్ ని లైట్ గా తీసుకుంది


supriya comments on pawan kalyan

పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ అవుతాడని అస్సలు ఊహించలేదని కుండబద్దలు కొట్టి మరీ అంటోంది నాగార్జున మేనకోడలు సుప్రియ . 22 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్సుప్రియ జంటగా ” అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది సుప్రియ . పవన్ కళ్యాణ్ కు సుప్రియ కు అదే మొదటి సినిమా కావడం విశేషం , అయితే ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం ప్రేక్షకాదరణ పొందలేదు ఈ జంట ప్రేక్షకుల మెప్పు పొందలేదు దాంతో సినిమాల్లో మళ్ళీ నటించలేదు సుప్రియ .

అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఆసినిమా తర్వాత హిట్స్ కొట్టాడు స్టార్ అయ్యాడు కట్ చేస్తే పవర్ స్టార్ అయ్యాడు . ఇప్పటికి కూడా ఎంతటి స్టార్ డం వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ కు మొహమాటం ఎక్కువ ,సెట్ లో సైలెంట్ గా ఉండేవాడట దాంతో పవన్ కళ్యాణ్ ని లైట్ గా తీసుకుంది యితడు పెద్ద స్టార్ కాడని అనుకుంది . ఇక 22 ఏళ్ల తర్వాత సుప్రియ మళ్ళీ కెమెరా ముందుకు వచ్చింది గూఢచారి చిత్రంతో . ఆ సినిమాకు , సుప్రియ కు మంచి పేరు రావడంతో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలను పోషిస్తానని అంటోంది . అలాగే నన్ను పవన్ కళ్యాణ్ హీరోయిన్ అంటే సంతోశంగా లేదని నాకంటూ ఓ ఐడెంటిటీ కావాలని కోరుకుంటానని అంటోంది సుప్రియ .

English Title: supriya comments on pawan kalyan