ఆ ఇద్దరి మధ్య గొడవకు ఈమె కారణమట


supriya revealed the untold story of akkineni and dasari warమహానటుడు అక్కినేని నాగేశ్వర రావు – దర్శకరత్న దాసరి నారాయణరావు లు మంచి స్నేహితులు . దాసరి అభిమాన నటుడు అక్కినేని దాంతో అక్కినేని అంటే దాసరి కి ఎనలేని గౌరవం కూడా కానీ నాలుగు దశాబ్దాల స్నేహం ఒక్కరి వల్ల మనస్పర్థలకు దారితీసింది. దాంతో అక్కినేని – దాసరి ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేసింది. ఇక అప్పటి నుండి సినిమా వేడుకలలో దాసరి – అక్కినేని కలిసి కనిపించిన దాఖలాలు లేవు, ఒకవేళ ఒకే ఫంక్షన్ లో పాల్గొనాలంటే ఒకరు వచ్చి వెళ్లిన తర్వాత మరొకరు వచ్చేవాళ్ళు అంతగా బద్ధ శత్రువులయ్యారు. అయితే ప్రాణ స్నేహితుల లాగా ఉండేవాళ్ళు శత్రువులు గా మారడానికి కారణం ఎవరో తెలుసా……. అక్కినేని నాగేశ్వర రావు మనవరాలు సుప్రియా.

అవును సుప్రియా నే ఆ ఇద్దరి మధ్య గొడవలకు కారణం అయ్యింది, అయితే తన తప్పు ని కాస్త ఆలస్యంగా తెలుసుకుంది . ఈ విషయాన్ని తాజాగా ఓ టివి షోలో పాల్గొని చెప్పింది. అసలు విషయం ఏమిటంటే …….. సుప్రియకు అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను ఇచ్చారు దాంతో తన హయాంలో అంతా స్ట్రిక్ట్ గా ఉండాలని భావించి స్టూడియో నిర్వహణ పట్ల కఠినంగా ఉండేదట ఆ క్రమంలోనే దాసరి నారాయణరావు స్టూడియో లో షూటింగ్స్ చేసుకొని కట్టకుండా ఉన్న డబ్బు ని కట్టేయమని ఒత్తిడి తెచ్చిందట అంతేకాదు మళ్లీ షూటింగ్ కి స్టూడియో కావాలని వెళ్లిన దాసరి కి స్టూడియో ఇవ్వలేదట అంతే దాసరి కి ఎక్కడో కాలింది అందుకే అక్కినేని పై కోపం పెంచుకున్నాడు. అక్కినేని కి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడిని నన్నే అవమానిస్తారా ? అసలు ఆ స్టూడియో బిజీ కావడానికి నేనే కారణం అని పట్టుదలకు పోయాడు , ఇక అక్కినేని ఏమో మనవరాలు సుప్రియ చెప్పింది విని దాసరి ని దూరం పెట్టాడు దాంతో ఇద్దరి మధ్య వైరుధ్యం పెరిగింది. అయినప్పటికీ దాసరి మాత్రం ఇండస్ట్రీ పెద్దగా ఎవరికి సమస్య వచ్చినప్పటికీ దానికి పరిష్కారం చూపేవాడు. అక్కినేని హీరోలైన నాగార్జున నటించిన ఢమరుకం , నాగచైతన్య నటించిన ఆటోనగర్ సూర్య చిత్రాల విడుదలలో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తితే వాటిని పరిష్కరించి ఆ సినిమాలు విడుదల అయ్యేలా చేసింది దాసరి నారాయణరావు . నిజంగా సినీ ఇండస్ట్రీలో అసలు సిసలైన లీడర్ . కానీ ఇప్పుడు దాసరి కుటుంబం ఇబ్బందుల్లో ఉండటం శోచనీయం.

English Title: supriya revealed the untold story of akkineni and dasari war

supriya revealed the untold story of akkineni and dasari war