నటి సురేఖావాణి భర్త మృతి


నటి , యాంకర్ సురేఖావాణి భర్త సురేష్ తేజ మరణించాడు . దాంతో సురేఖావాణి కుటుంబంలో విషాదం నెలకొంది . సురేష్ తేజ – సురేఖావాణి లది ప్రేమ వివాహం కాగా సురేష్ తేజ పలు టివి ప్రోగ్రాం లకు దర్శకత్వం వహించాడు . అయితే గతకొంత కాలంగా సురేష్ తేజ అనారోగ్యంతో బాధపడుతున్నాడు కాగా ఈరోజు అనారోగ్యంతో తుది శ్వాస విడిచాడు . సురేఖావాణి యాంకర్ గా ఉన్న సమయంలో సురేష్ తేజ ని ప్రేమించింది . పెద్దలు పెళ్ళికి ఒప్పుకోకపోయినప్పటికీ వాళ్ళని ఎదురించి పెళ్లి చేసుకున్నారు .

సురేఖావాణి – సురేష్ తేజ లకు ఒక కూతురు . భర్త మరణంతో తీవ్ర విషాదంలో మునిగింది సురేఖావాణి . సురేష్ తేజ మరణవార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సురేఖావాణి కి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు . టివి ప్రోగ్రాం లలోనే కాకుండా పలు చిత్రాల్లో సురేఖావాణి నటించిన విషయం తెలిసిందే .