సైరా క్లైమాక్స్ విషాదాంతం కాదు, విజయానికి ఆరంభం – సురేందర్ రెడ్డి


Surender-Reddy
Surender-Reddy

మెగాస్టార్ చిరంజీవి పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానున్న విషయం తెల్సిందే. అయితే విడుదల తేదీ దగ్గరపడే కొద్దీ ఈ సినిమాకి సంబంధించిన కొత్త విషయాలు మనకి తెలుస్తున్నాయి.

ఇటీవలే మీడియా ఈ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డిని తెలుగులో సాధారణంగా విషాదాంతాలను అంత త్వరగా జీర్ణించుకోలేరు. మరి సైరా కథ విషాదాంతం కదా.. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకుంటున్నారా? అని ప్రశ్నించగా..

దానికి సురేందర్ రెడ్డి సమాధానమిస్తూ “చరిత్ర గురించి చెప్పేటప్పుడు దాన్ని మార్చి తీయలేం. నరసింహారెడ్డి చనిపోయినా, ఆయన చావు వేలాదిమందిలో స్వాతంత్ర కాంక్షను రగిలించింది. అందుకే ఆయన చావు విషాదాంతం కాదు, విజయానికి  ఆరంభం అని చెప్పారు.

ఆయన చనిపోయాక ఆయన తలను 30 ఏళ్ల పాటు అలాగే వేలాడదీసి ఉంచారంటేనే అర్ధం చేసుకోవచ్చు బ్రిటీషువారిని ఆయన ఎంతలా భయపెట్టారో. కాబట్టి సైరా క్లైమాక్స్ విషాదాంతం అనకూడదు” అని అన్నారు.